'ఆ కారణంగా ఆఫర్స్ కోల్పోయా.. ఇండస్ట్రీలో ఆ పిచ్చి ఎక్కువే'

సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా అవకాశాలు దక్కకపోవడం, చివరి నిమిషంలో ఛాన్స్ చేజారిపోవడం వంటి సంఘటనలు కొత్తేమి కాదు.. కొత్తవారికి ఇలాంటి చేదు అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. కానీ, ఒక నటుడు మాత్రం తనకు వచ్చిన అవకాశాలు కేవలం కుల వివక్ష కారణంగానే పోయాయని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయ్యి, డేట్స్ కూడా ఫిక్స్ అయిన తర్వాత చివరి క్షణంలో తనను తప్పించి వేరే వ్యక్తిని తీసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ఇండస్ట్రీలో ఇలాంటి చేదు అనుభవాలను బయటపెట్టిన ఆ నటుడు ఎవరు?

ఆ నటుడు ఎవరో కాదు.. యువ నటుడు మహేశ్ విట్టా (Mahesh Vitta). యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు, ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎదురైన కుల వివక్ష గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అప్పట్లో చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తుండటంతో నెటిజన్లు ఈ వీడియోను మళ్లీ షేర్ చేస్తున్నారు.

Actor Mahesh Vitta Reveals Caste Bias in Tollywood Losing Roles Despite Talent

మహేష్ విట్టా అసలు నటుడిగా ఇండస్ట్రీలోకి రావాలనుకోలేదు. 2016లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశాల కోసం తేజా Teja ను కలిశారు. అయితే మహేష్‌లోని హాస్య టైమింగ్‌ను గమనించిన తేజ, "డైరెక్షన్ కంటే నటనలోకి వెళ్తే త్వరగా సక్సెస్ అవుతావు" అని సూచించడంతో ఆయన తన కెరీర్ ట్రాక్ ను మార్చుకున్నారు. ఆ నిర్ణయం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోలతో పాపులర్ అయ్యారు. తర్వాత సినిమాలు, టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

అయితే ఈ ప్రయాణం అంత సులభం కాలేదని మహేష్ తన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయినప్పటికీ, చివరి నిమిషంలో తన స్థానంలో వేరే నటులను తీసుకున్న సందర్భాలు తరచూ జరిగేవని తెలిపారు. మొదట్లో దీనికి కారణం అర్థం కాలేదని, కానీ తర్వాత పరిశీలిస్తే అదే పాత్రకు తీసుకున్న వ్యక్తి నిర్మాత లేదా దర్శకుడి సామాజిక వర్గానికి చెందినవాడే కావడం తెలిసిందని వెల్లడించారు. "టాలెంట్ ఉన్నా... కేవలం కులం కారణంగా అవకాశాలు కోల్పోయాను" అని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కేవలం కుల వివక్ష మాత్రమే కాకుండా, ఆర్థిక సమస్యలు కూడా తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని మహేష్ వెల్లడించారు. కొన్ని సినిమాల్లో గుర్తింపు కోసం పారితోషకం లేకుండా పనిచేశానని, కానీ పని చేసిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అవసరం వల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించాల్సి వచ్చిందని, ఆ సమయంలో సెలెక్టివిటీ లేకపోవడం వల్ల కూడా నష్టపోయానని తెలిపారు.

ఇంకా, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఇండస్ట్రీలో కొందరు తనను చిన్నచూపు చూసేవారని కూడా ఆయన పేర్కొన్నారు. ఎన్నో అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగానని, అదే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో తన స్నేహితులను కోల్పోయిన తర్వాత, వారికి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలనే ఆలోచన వచ్చినట్టు వెల్లడించారు. తనలాంటి అనేకమంది కొత్తవారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X