Bigg Boss Unseen: బిగ్‌బాస్ షోలో మణికంఠ లవ్ ప్రపోజల్.. ఆంటీ అంటూ ఆ కంటెస్టెంట్‌తో పులిహోర!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీల రాకతో సందడి సందడిగా కనిపిస్తున్నది. అయితే ఎప్పటిలానే ఇంటి సభ్యులు మధ్య గొడవలు, సలహాలు, సూచనలతో ఆసక్తికరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఫేమ్ లేని కంటెస్టెంట్లతో తడబాటుకు గురైన ఈ షోలోకి సీనియర్లు ఎంట్రీ ఇవ్వడంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్లేవర్ మారింది. అయితే తాజాగా ఇంట్లోకి వచ్చిన ఓ కంటెస్టెంట్‌తో మణికంఠ పులిహోర కలపడం కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఐదు వారాల్లో 6 గురు సభ్యులను ఎలిమినేట్ చేశారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకులు, ఆదిత్య ఓం, నైనిక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. వారి స్థానంలో మరో 8 మందిని వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. వారి రాకతో ఇంటిలో కొత్త ఉత్సాహం కనిపించింది.

బిగ్‌బాస్ షోలో ఆరోవారం ఆరంభంలో వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా గంగవ్వ, హరితేజ, జబర్దస్త్ అవినాస్, మెహబూబ్, నయని పావని, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, రోహిణి తదితరులు ఇంట్లోకి అడుగుపెట్టారు. దాంతో ప్రస్తుతం కొత్త, పాత అనే రెండు గ్రూపులను క్రియేట్ అయ్యాయి. ఇక సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతున్నారు.
ఇలా గేమ్ సాగుతున్న నేపథ్యంలో మణికంఠ ఎప్పటిలానే కన్‌ఫ్యూజన్‌తో ఇంటిలో కనిపించాడు. రోహిణిని పారిజాతం అంటూ పులిహోర కలిపాడు. నిన్ను నేను మంచి చూసుకొంటా.. నా ప్రపోజల్ అంగీకరించు అంటే.. నీతోనా అంటూ రిజెక్ట్ చేసింది. అయినా పారిజాతం నువ్వే నన్ను అర్ధం చేసుకోవాలి అంటూ అడిగాడు.

దాంతో మణికంఠకు జవాబిస్తూ.. ఆల్రెడీ యూజ్డ్ నేను వాడను. పెళ్లిన వారంటే నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ పెళ్లి చేసుకొన్న నేను ఒప్పుకొను అంటూ రోహిణి ఘాటుగా జవాబిచ్చింది. అయినా మణికంఠ టిష్యూ పట్టుకొని.. నేను, నా మనసు తెల్లకాగితం లాంటింది. నీవు టిష్యూ తీసుకోకపోతే ఇష్యూస్ అవుతాయి. ప్లీజ్ అంటూ వెంటపడి దానిని ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
అయితే మణికంఠ బాధపడలేక ఆ టిష్యూను తీసుకొని.. వెంటనే చెత్త బుట్టలో వేసింది. అయితే నేను ఇచ్చింది తీసుకొన్నావు. అది చాలూ.. దానిని ఎక్కడ పడేసినా నాకు బాధలేదు అంటూ మణికంఠ కామెంట్ చేశాడు. ఈ ఫన్నీ ఎపిసోడ్ కిచెన్ వద్ద నిఖిల్, అవినాష్ ఉండగా జరిగింది. ఇదంతా సరదగా సాగిపోయింది.


Click it and Unblock the Notifications











