బిగ్ అనౌన్స్ అంటూ లీక్ చేసిన గీత మాధురి భర్త.. ఇలా చేస్తే బిగ్ బాస్ 4 నుంచి ఔటే..?
బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ కోసం ఒక వర్గం ఆడియేన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. గత మూడు సీజన్స్ కూడా ఒకదానికి మించి మరొకటి అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో ఈ సారి మరింత హైప్ వచ్చేలా నిర్వాహకులు చాలానే కష్టపడుతున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా లీక్ అవ్వకుండా ఫాలో అవుతున్న సమయంలో గీత మాధురి భర్త సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఫైనల్ లిస్ట్ లో నందు..?
నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ 2లో సింగర్ గీతా మాధురి కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి నాలుగవ సిజన్ లో ఆమె భర్త నందు కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు రోజుకోటి వైరల్ అవుతున్నాయి. ఫైనల్ లిస్ట్ లో నందు కూడా ఉన్నాడని కామెంట్స్ వస్తున్నాయి.

BBలోకి అడుగుపెట్టబోతున్నట్లు..
అయితే గాసిప్స్ డోస్ పెరుగుతున్న సమయంలో నందు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే తాను BBలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. BB అంటే బిగ్ బాస్ అనే కదా అర్థం అంటూ నెటిజన్స్ కామెంట్స్ బాగానే చేస్తున్నారు.

BBలో మన రచ్చ మామూలుగా ఉండదు..
డార్లింగ్ నేను BBలోకి వెళుతున్నా.. BBలో మన రచ్చ మామూలుగా ఉండదు. మోర్ ఎంటర్టైన్మెంట్ మీ కోసం వస్తోంది. మీ సపోర్ట్ నాకు కావాలి అంటూ రేపు మరో ఎనౌన్స్మెంట్ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే బిగ్ ఎనౌన్స్మెంట్ పక్కా ఉంటుందని చెప్పడం చూస్తుంటే మరికొంత అనుమానం కూడా కలుగుతోంది.

ఆ మాత్రం తెలియదా..?
సాధారణంగా బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఎవరైనా సరే హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చే వరకు కూడా బయటప్రపంచానికి తెలియనివ్వకుండా జాగ్రత్తపడాలి. ఓకేవేళ ముందే చెబితే.. నిబంధనల ప్రకారం వారిని లిస్ట్ లో నుంచి చివరి నిమిషంలో అయినా సరే లేపేస్తారు. ఇక ఈ విషయం నందుకు తెలియనిది కాదు. పైగా భార్యకి ఒకసారి బిగ్ బాస్ అనుభవం ఉంది కాబట్టి అలాంటి విషయాలు తెలియకుండా ఉండవు.
Recommended Video

ఎలాంటి అప్డేట్ ఇస్తాడో..
చూస్తుంటే నందు మరేదో కొత్త ప్రమోషన్ స్టంట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. నందు నటుడిగా ఇంతవరకు సరైన గుర్తింపు అయితే అందుకోలేదు. 100% లవ్ సినిమాలో ఒక మంచి సపోర్టింగ్ రోల్ తో క్రేజ్ అందుకున్న నందు ఆ తరువాత హీరోగా కూడా ట్రై చేశాడు. మొన్న ఆ మధ్య సవారి అనే సినిమాతో కొంత హడావుడి చేసినప్పటికి వర్కౌట్ కాలేదు. మరి ఇప్పుడు BB అంటూ ఎదో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి అప్డేట్ ఇస్తాడో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











