పల్లవి ప్రశాంత్‌కు దిమ్మతిరిగే షాక్: వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్న నటుడు.. జైలు శిక్ష ఖాయం
సాధారణ రైతు కుటుంబానికి చెందిన కుర్రాడే అయినా.. సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా చాన్స్ పట్టేశాడు పల్లవి ప్రశాంత్. ఇందులో ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ఆటతీరును కనబరిచి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. తద్వారా ఏడో సీజన్ విజేతగా నిలిచాడు. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు లేకుండానే కేసులో చిక్కుకోవడం.. ఆ తర్వాత జైలుకు వెళ్లడం చకచకా జరిగాయి. ఇక, బెయిల్‌పై విడుదలైన ప్రశాంత్‌ను సీరియల్ నటుడు నరేష్ లొల్ల షాకివ్వబోతున్నాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!
రిమాండ్‌పై జైలుకు ప్రశాంత్:బిగ్ బాస్ ఫినాలే ముగిసిన తర్వాత జరిగిన గొడవలకు బాధ్యుడిని చేస్తూ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌పై అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

బెయిల్‌పై తిరిగొచ్చిన విన్నర్:ఏకంగా 9 సెక్షన్ల కింద అరెస్ట్ అయి జైలు పాలైన పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ కోరుతూ పలువురు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై జరిగిన విచారణలో జడ్జ్ అతడికి బెయిల్ మంజూరు చేశారు. ఈ మేరకు కొన్ని షరతులను కూడా విధించిన విషయం తెలిసింే. దీంతో పల్లవి ప్రశాంత్ శనివారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ అయిపోయాడు.
నటుడు నరేష్ ఫుల్ ఫైరింగ్:పల్లవి ప్రశాంత్ చేసిన దాడి సమయంలో అమర్‌దీప్ చౌదరి కారులో ఉన్న అతడి స్నేహితుడు, నటుడు నరేష్ లొల్ల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ షో తర్వాత జరిగిన దాడి విషయంలో తామంతా భయబ్రాంతులకు గురయ్యామని చెప్పిన నరేష్.. దీనికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టేది లేదంటూ తేల్చేశాడు. అలాగే, కోర్టులో సాక్ష్యం కూడా చెప్తానని అన్నాడు.

ఏం చెప్పాలో తెలియలేదు:నరేష్ మాట్లాడుతూ.. 'మేమంతా ఫినాలే రోజు సాయంత్రం 5 గంటలకే స్టూడియోకు వెళ్లాం. 8.30 గంటలకు విజేతను ప్రకటించారు. అది అయిపోగానే అమర్ బజ్ ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చాడు. అప్పుడు బయట పరిస్థితి ఎలా ఉంది అని నన్ను అడిగాడు. కానీ, బయట కొందరు రచ్చ లేపుతున్నారు అన్న విషయాన్ని మాత్రం అతడికి చెప్పలేకపోయాము' అంటూ వెల్లడించాడు.
లైట్లు వేసి మరీ వెతుకుతూ:నరేష్ కొనసాగిస్తూ.. 'మేము పెట్టుకున్న బౌన్సర్లు బయటకు వెళ్లొచ్చి.. చాలా మంది పెట్రోల్, రాళ్లు, గుడ్లు పట్టుకుని ఉన్నారని చెప్పారు. అప్పుడు నేను అమర్‌తో లెంట్‌గా ఉండు. దేనికీ రియాక్ట్ అవకు అని చెప్పాను. అందుకు తగ్గట్లే మా కార్లు బయటకు రాగానే వాళ్లు టార్చ్ లైట్స్ వేసుకుని అమర్ కోసం వెతుకుతున్నారు. అంతలా వాళ్లంతా రెచ్చిపోయారు' అని వివరించాడు.

బూతులు.. దొంగతనాలు:ఆ తర్వాత నరేష్.. 'మా కారు బయటకు రాగానే దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దారుణమైన బూతులు తిట్టారు. ఆడవాళ్లు ఉన్నా వదల్లేదు. మా కారులో ఉన్న లగేజ్, డ్యాక్యూమెంట్లు తీసుకెళ్లారు. ఒకడు పైకి ఎక్కి రచ్చ చేశారు. ఇప్పుడు అడుగుతున్న అమర్ దొరికితే ఏం చేస్తారు? మీ బతుకులు చెడా. పక్షవాతం వచ్చిన అమర్ వాళ్ల నాన్న బాధ మీకు తెలుసా' అన్నాడు.
నేనే సాక్ష్యం చెబుతాను:చివర్లో నరేష్ 'నా కొడకల్లారా.. మిమ్మల్ని వదిలేది లేదు. ఎవరు రియలో ఎవరు ఫేకో ఇప్పుడు తెలుస్తుంది మీకు. పోలీసులు కేసు పెట్టారు కదా నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి. నేను వెళ్లి సాక్ష్యం చెప్తా. ప్రశాంత్‌ను విన్నర్‌ను కాకుండా.. అమర్‌ని విన్నర్‌ను చేస్తే అన్నపూర్ణ స్టుడియోను తగలబెట్టేస్తారా? పక్కనోళ్లని ఇబ్బంది పెట్టే ఫ్యాన్స్ మాకు అవసరం లేదు' అని చెప్పాడు.


Click it and Unblock the Notifications











