Bigg Boss Telugu: బిగ్‌బాస్‌కు వెళ్తే కెరీర్ ముగిసినట్లేనా? హీరో నవదీప్ షాకింగ్ కామెంట్స్..
Bigg Boss Telugu: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నవదీప్ (Navadeep) మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. చందమామ, గౌతమ్ ఎస్‌ఎస్‌సీ వంటి సినిమాలతో హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆర్య 2, అలా వైకుంఠపురం వంటి భారీ చిత్రాల్లో కీలక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. హీరోగా అవకాశాలు తగ్గినా, మంచి పాత్రల ఎంపికతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకున్న నటుడిగా నవదీప్‌ను చెప్పుకోవచ్చు. తాజాగా బిగ్‌బాస్ రియాలిటీ షోపై హీరో నవదీప్ చేసిన షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా బిగ్‌బాస్ షోలో పాల్గొని మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు నవదీప్. బిగ్‌బాస్ ద్వారా తన వ్యక్తిత్వాన్ని మరింతగా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఆయన ఇటీవల 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష' కార్యక్రమంలో జడ్జిగా కూడా వ్యవహరించారు. తాజాగా నవదీప్ నటిస్తున్న 'దండోరా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్, 'బిగ్‌బాస్ వల్ల చాలామందికి కెరీర్ క్లోజ్ అవుతోంది అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?'అని ప్రశ్నించారు.

హీరో నవదీప్ మాట్లాడుతూ.. 'ఈ ప్రశ్నను ఇండివిజువల్‌గా ఆలోచించాలి. బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత ఇది జరగాలి. అది జరగాలి అని అంచనాలు పెట్టుకుని, అవి నెరవేరకపోతేనే ఇలాంటి కామెంట్స్ వస్తాయి. బిగ్‌బాస్ వల్లే నా కెరీర్ క్లోజ్ అయింది అనడం సరైన విశ్లేషణ కాదు' అని నవదీప్ అభిప్రాయపడ్డారు. తనకు తెలిసి, తాను బిగ్‌బాస్‌కు వెళ్లిన పరిస్థితి మరెవరికీ జరగలేదని కూడా చెప్పారు.
ఇక వ్యక్తిగతంగా తనపై ఇతరులు ఏం అనుకుంటున్నారు అన్నది తనకు అస్సలు సంబంధం లేదని నవదీప్ స్పష్టం చేశారు. 'నన్ను డైరెక్ట్‌గా తెలిసిన వాళ్లు నా గురించి ఏం అనుకుంటున్నారు. నన్ను తెలియని వాళ్లు ఏం అనుకుంటున్నారు అనే విషయాలు నాకు పెద్దగా అవసరం లేదు. నా సర్కిల్‌లో నన్ను ఎలా ట్రీట్ చేస్తారు అనే దానికీ నేను ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వను. అలాంటి మైండ్‌సెట్‌లో ఉన్న రోజుల్లోనే బిగ్‌బాస్ అవకాశం వచ్చింది' అని చెప్పారు.
కెరీర్ పరంగా చూస్తే, సరైన అవకాశాలు రాకపోయినప్పుడు మాత్రమే 'బిగ్‌బాస్ వల్ల లైఫ్ క్లోజ్ అయింది' అనే మాటలు వస్తాయని నవదీప్ అభిప్రాయపడ్డారు. 'బిగ్‌బాస్ అనేది నువ్వు ఏంటో నలుగురికి ఉన్నది ఉన్నట్టుగా చూపించే వేదిక. నువ్వెలా ఉంటావు, నీ అసలు క్యారెక్టర్ ఏంటో పరీక్షించేదే బిగ్‌బాస్'అని ఆయన అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. సాధారణ ఇంటర్వ్యూల్లో మనం మనల్ని మనమే సమర్థించుకుంటూ సమాధానాలు చెబుతామని, కానీ అసలు వ్యక్తిత్వం బయటకు రావడం కష్టమని చెప్పారు. ' కానీ బిగ్‌బాస్ ఫార్మాట్ వేరు. మనిషిని అన్నింటికీ దూరంగా పెట్టి, ఆకలితో, నిద్ర లేకుండా, ఒత్తిడిలో ఉంచి, గెలుపు కోసం పోటీ పడే పరిస్థితిలోకి నెట్టినప్పుడు లోపల ఉన్న అసలు రూపం బయటపడుతుంది. అదే బిగ్‌బాస్ ఫిలాసఫీ, అదే బిగ్‌బాస్ కాన్సెప్ట్'అని వివరించారు.
అయితే ఈ విషయాన్ని సాధారణ ప్రేక్షకులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు ఆ షో అసలు ఎలా ఉంటుందో తనకు ముందుగా తెలియదని నవదీప్ చెప్పారు. తెలుగులో అది తొలిసారి జరుగుతున్న సమయంలో తాను షోలోకి వెళ్లానని గుర్తుచేశారు. తన స్నేహితులను అడిగితే, 'నువ్వు ఏంటో నలుగురికి తెలిసేలా చేసేదే బిగ్‌బాస్' అని చెప్పారని తెలిపారు. ఆ సమాధానం తనను షాక్‌కు గురి చేసిందని, 'నేనేంటో నాకు తెలియాలా? ఇప్పటికే సినిమాలు, టీవీల్లో నటిస్తున్న నాకు ఇది అవసరమా?' అని తన స్నేహితుడు కూడా ప్రశ్నించిందని నవదీప్ వెల్లడించారు.
అయితే చివరికి తన స్నేహితులు మాత్రం 'నువ్వు కచ్చితంగా వెళ్లాలి. ఈ షో ఏంటో నీకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం నువ్వు ఉన్న క్రిటికల్ ఫేజ్‌లో ఇది సరైన సమయం' అంటూ బలవంతం చేసి పంపించారని నవదీప్ చెప్పారు. మొత్తానికి బిగ్‌బాస్‌పై నవదీప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చలకు దారి తీస్తున్నాయి.


Click it and Unblock the Notifications











