Actor Prabhakar: ప్రియురాలితో ప్రభాకర్, కన్నీళ్లు పెట్టుకున్న మలయజ - చివరకు ఏం జరిగిందంటే?

Actor Prabhakar: సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఆయన భార్య మలయజ గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ కలిసి అనేక టీవీ షోలు, సీరియళ్లలో కనిపిస్తుంటారు. చాలా కాలంగా ప్రభాకర్ అనేక ఛానెళ్లలో సీరియల్స్ లో కనిపిస్తూ అలరిస్తున్నాడు. అయితే తాజాగా తన భార్య మలయజతో కలిసి ఓ షోకు వచ్చాడు. తన ప్రేమ, పెళ్లి విషయాలపై స్పందించాడు. పలు ఆసక్తికర విషయాలు తెలిపి అందరినీ షాక్ కు గురి చేశాడు. గతంలో తాను.. తన భార్య మలయజతోనే కాకుండా తాను మరో అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చాడు. దాని వల్ల మలయజ చాలా ఇబ్బంది పడిందని, కన్నీళ్లు కూడా పెట్టుకుందని వెల్లడించాడు.

ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అయిన ఓ షోలో పాల్గొన్న మలయజ, ప్రభాకర్ దంపతులకు వారి పెళ్లి నాటి ఫొటోలను చూపించారు. వాటిని చూడగానే ఇద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు. అలాగే తమది దొంగ పెళ్లి అని చెప్పుకొచ్చారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. అయితే ఖమ్మం నుంచి వచ్చిన ప్రభాకర్ స్నేహితుడు.. కాళ్లు కడిగి కన్యాదానం చేశాడని, అతడే పెళ్లి పెద్దగా నిలబడి తమతో ఏడడుగులు వేయించినట్లు స్పష్టం చేశారు. అలాగే తనకు మలయజ కాకుండా మరో గర్ల్ ఫ్రెండ్ ఉండేదని ప్రభాకర్ చెప్పాడు.

Actor Prabhakar:

కానీ తన ప్రియురాలి వల్ల భార్య మలయజ చాలా ఇబ్బంది పడిందని, చాలా సందర్భాల్లో కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు చెప్పాడు. అయితే భార్య బాధ పడుతున్నట్లు తెలుసుకుని ఆ సమస్యను సరిచేశాడట. అంతే కాకుండా భార్యను బాధ పెట్టిన తాను మనస్ఫూర్తిగా మలయజకు క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు. తాను సారీ చెప్పడం కంటే కూడా తన భార్య ఆ సమస్యను, తాను చేసిన తప్పును అర్థం చేసుకొని క్షమించడం చాలా గ్రేట్ అంటూ చెప్పుకొచ్చాడు. తన భార్యపై తనకున్న ప్రేమ గురించి కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగానే భార్య మలయజ చెంపపై ముద్దు పెట్టాడు. అది చూసిన అంతా వారి ప్రేమకలు మంత్రముగ్ధులు అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

 Actor Prabhakar Shocking Comments About His Marriage And Girl Friend

ప్రభాకర్ ఇప్పటికీ పలు సీరియళ్లతో పాటు టీవీ షోలలో కనిపిస్తుండగా.. అతడి భార్య మలయజ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఇందులో తనకు సంబంధించిన అన్ని విషయాలతో పాటు భర్త, పిల్లల గురించి వీడియోలు చేస్తుంటుంది. అలాగే ప్రభాకర్ కుమారుడు సుహాస్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆయన ఆటిట్యూడ్ స్టార్ గా సుపరిచితం. ప్రభాకర్ మలయజ దంపతులకు సుహాస్తో పాటు మరో కూతురు కూడా ఉంది. ఆమె పేరు దివిజ. ఆమె కూడా పలు సినిమాల్లో నటించింది

 Actor Prabhakar Shocking Comments About His Marriage And Girl Friend
.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X