For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Actor Priya in Bigg Boss Telugu 5: కట్టుకొన్న వాడితో అలా.. ఒంటరి జీవితంలో విషాదాన్ని బయటపెట్టిన ప్రియ

  |

  నటిగా ప్రియగా అందరికి సుపరిచితులైన తెలుగు టెలివిజన్, సీరియల్స్‌లో తన నటనతో మెప్పిస్తూ ఆకట్టుకొంటున్నారు. ప్రియ అసలు పేరు శైలజ ప్రియ. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. ప్రియ సఖి సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. నెంబర్ 1 కోడలు సీరియల్‌తోపాటు మరికొన్ని సీరియల్స్ నటించారు. చాలా ఎమోషనల్ స్టోరీతో బిగ్‌బాస్ ఎంట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు వింటే.. ఎవరైనా భావోద్వేగానికి గురి కావాల్సిందే. ఆమె అందమైన చిరునవ్వు వెనుక ఇంతటి విషాదం ఉందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది? ప్రియ జీవితంలో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

  100 సంవత్సరాల కష్టాన్ని అంటూ..

  100 సంవత్సరాల కష్టాన్ని అంటూ..

  అందానికి అందమైన ముద్దుగుమ్మ నడిచి వచ్చే సమయంలో.. ప్రేమ అందమైన ఊహాలోకానికి ఒంటరిగా ఆహ్వానిస్తుందని ఊహించలేదు. కానీ ఎప్పుడూ ఇలానే సాగిపోవాలనే కొన్ని మధుర క్షణాలు ఎప్పుడూ శాశ్వతం కాదని తెలిసిపోయింది. ఒక్క నిర్ణయం వంద సంవత్సరాల కష్టాన్ని మరిచిపోయేలా చేస్తుంది. ఆ నిర్ణయం కోసం 18 సంవత్సరాలుగా ఒక మగువ చేసిన అన్వేషణను ఏ విధంగా వర్ణించగలం. కట్టుకొనే వాడితో కలకాలం కలిసి ఉండాలనే ఆశతో, కలిసి ఉండాలనే నమ్మకంతో ఆ ఇంట అడుగుపెట్టిన అమ్మాయి సంతోషం అన్నిసార్లు పూలబాట కాదనే విషయం తెలిసింది.

  నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకొనేందుకు

  నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకొనేందుకు

  మనసారా ఘన స్వాగతం చెప్పే ప్రేమను చేరుకోడం ఆ అమ్మాయి కోరుకొన్న జీవితాన్ని చేరుకోవడానికి అన్నిసార్లు సాధ్యపడకపోతే ఊహించని ఓదార్పు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మగువ జీవితంలో ఎంతటి కష్టాన్నైనా మరిపించే ఒకే ఒక పదం అమ్మ. కన్నపేగు స్వాగతించే ప్రేమ కళ్లముందే ఉన్నా.. కొన్నిసార్లు కలగా కరిగిపోతుంది. కన్నీటి అక్షరాల రూపంలో పదిలంగా నిలిచింది. ఈ అందమైన ఒంటరి జీవితంలో ఒంటరిగా పోరాటం నిజమైన ప్రేమను చేరుకోవడానికి, జీవితంలో గెలుపు సాధించుకోవడం సాధ్యం కాదు. మగఎంతటి నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాల్సి వచ్చింది. మీకు తెలిసిన ప్రియమైన రూపాన్ని కొత్త కోణంలో తెలియజేయడానికి నేను ఈ వేదిక మీదకు వస్తున్నాను అంటూ ప్రియ తన వీడియోలో విషాద గాధను వెల్లడించింది.

  ముకుంద చిత్రంలోని పాటకు

  ముకుంద చిత్రంలోని పాటకు

  ముకుంద చిత్రంలో గోపికమ్మ పాటతో నటి ప్రియ వేదిక మీదకు అడుగుపెట్టింది. డ్యాన్సర్లు ఘనంగా స్వాగతం చెప్పగా వారితో కలిసి స్టెప్పులు వేసింది. నాగార్జున వేదిక మీదకు రాగానే.. నేను గుర్తున్నానా సార్ అంటే.. అందమైన ప్రియగా ఇండస్ట్రీలోకి వచ్చావు. అందమైన అమ్మగా బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నావు అని నాగార్జున అన్నారు. దాంతో ఇండస్ట్రీలో ఇన్నాళ్లు ఉండటం గొప్ప వరం. ఇలా నిలబడి ఉంటడం కష్టం అని ప్రియ అన్నారు. నా కళ్ల ముందు చాలా మంది హీరోయిన్లు, నటులు వచ్చిపోయారు. కానీ నేను ఇంకా ఇక్కడే ఉండటం ఆనందంగా ఉంది అని ప్రియ అన్నారు.

  నా బలం, బలహీనతలు తెలుసుకోవడానికి

  నా బలం, బలహీనతలు తెలుసుకోవడానికి

  బిగ్‌బాస్‌లోకి ఎందుకు వచ్చానంటే.. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదైనా సాధించడం నా అభిమతం. నా బలం, బలహీనతలు తెలుసుకోవాలనే కోరిక కలిగింది. నేను సింగిల్‌గా ఉండాల్సిన పరిస్థితి వస్తే.. ఉండగలనా? అనేది చెక్ చేసుకోవాలి అనిపించిందని అంటే.. ఇన్నాళ్లు నీ అలానే ఉన్నావు కదా.. జీవితంలో ఏదైనా సెకండ్ ఇన్నింగ్స్ కోరుకొంటున్నావా? అంటే.. అవును అని ప్రియ అంటూ.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓ మహిళగా ఒంటరిగా అవకాశం ఇస్తే బతుక గలనా? అని తెలుసుకోవడానికి బిగ్‌బాస్ కోరుకొంటున్నాను అని ప్రియ అన్నారు.

   ప్రియకు కుమారుడి విషెస్

  ప్రియకు కుమారుడి విషెస్

  బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లే ముందు నీ కోసం ఒక సర్‌ప్రైజ్ అంటూ నాగార్జున ఒక వీడియో ప్లే చేశారు. అందులో ప్రియ కుమారుడు తల్లికి విషెస్ చెబుతూ.. నీవు ఎంత హార్డ్ వర్క్ చేస్తావో నాకు తెలుసు. నాకు బాగా స్వేచ్ఛను ఇచ్చారు. మంచి జీవితాన్ని ఇచ్చారు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులను అధిగమించావో నాకు తెలుసు. నీవు బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నావు. ఆ గేమ్‌లో నీవు నీలా ఉంటే చాలూ.. అన్ని విషయాల్లో విజయం సాధిస్తావు. కాబట్టి గేమ్‌ను చాలా ఆనందంగా ఆస్వాదించు అంటూ తల్లి ప్రియకు కొడుకు విషెస్ చెప్పారు. ఎప్పుడూ మౌనంగా ఉండే తన కుమారుడు గలగలా మాట్లాడటంతో ప్రియ మురిసిపోయింది. వెంటనే తన అడుగులు బిగ్‌బాస్ వైపు వేసింది.

  బిగ్‌బాస్‌లో ప్రియ రెమ్యునరేషన్ ఎంతంటే

  బిగ్‌బాస్‌లో ప్రియ రెమ్యునరేషన్ ఎంతంటే

  ఇదిలా ఉండగా, తెలుగు టెలివిజన్ సీరియల్స్‌లో తనదైన శైలిలో అమ్మ పాత్రల్లో, అలాగే క్యారెక్టర్ నటిగా దూసుకెళ్తున్న ప్రియకు బిగ్‌బాస్ నిర్వాహకులు భారీగానే పారితోషికాన్ని ఇచ్చినట్టు తెలుస్తున్నది. నటిగా తనకు ఉన్న హోదాను బట్టి ఆమెకు వారానికి ఐదు లక్షలు ఇస్తున్నట్టు సమాచారం. అంతకు మంచి కూడా ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కూడా సినీ వర్గాలు ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా బిగ్‌బాస్‌లో ప్రియ ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.

  Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
   ప్రియ సినిమా కెరీర్ ఇలా..

  ప్రియ సినిమా కెరీర్ ఇలా..

  ప్రియ కెరీర్ విషయానికి వస్తే.. చిరంజీవి నటించిన మాస్టర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అన్నయ్య చిత్రంలో సౌందర్య స్నేహితురాలిగా కనిపించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేష్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ లాంటి అగ్రనటులతో నటించారు. ఇటీవల ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతితోపాటు కలిసి నటించారు.

  English summary
  Actor Priya entered into Bigg Boss Telugu 5. Here is the her Biography, life facts, career and Remuneration.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X