శేఖర్ మాస్టర్ ను అవమానించిన ప్రియదర్శి.. ‘బలగం’ హీరో ఏమన్నాడో తెలుసా?
స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పైగా బుల్లితెర ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1996 నుంచి టెలివిజన్ రంగంలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆట డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల్లో ఎంతగానో గుర్తింపును దక్కించుకున్నారు. తన డ్యాన్స్ తో 20 కిందనే మేజిక్ చేశారు. ప్రస్తుతం స్టార్ మూవీ కొరియోగ్రాఫర్ గా కీర్తి పొందుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్ ప్రాజెక్ట్స్ లో హీరోలతో మాస్, క్లాస్, దుమ్ములేపే బీట్స్ కు స్టెప్పులు వేయిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటున్నారు.
ఓవైపు సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తూనే మరోవైపు టీవీ షోల్లోనూ జడ్జీగా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. తనదైన శైలిలో తీర్పులు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ఢీ షోకు జడ్జీగా వ్యవహిరించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు గెస్ట్ జడ్జీగానూ వ్యవహరించారు. కామెడీ స్టార్స్, డ్యాన్స్ ఐకాన్ వంటి షోలకు జడ్జీగా వ్యవహరించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం డ్యాన్స్ ఐకాన్ లో అలరిస్తూనే ఉండగా.. మరో కొత్త షోకు జడ్జీగా దర్శనమిచ్చారు. తనదైన శైలిలో తీర్పులిస్తూ, మధ్య మధ్యలో పంచులు పేల్చుతూ ఆకట్టుకుంటున్నారు.

మార్చి 29 నుంచి స్టార్ మాలో ప్రసారం అవుతున్న క్రేజీ గేమ్ షో 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2'కు శేఖర్ మాసర్ట్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన మొదటి సీజన్ విజయవంతమైంది. ఆ సీజన్ లో కిర్రాక్ బాయ్స్ టైటిల్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం సీజన్ 2లో అమ్మాయిలు, అబ్బాయిల టీమ్ కు పోటాపోటీగా టాస్క్ లు జరుగుతున్నాయి. శేఖర్ మాస్టర్, అనసూయ భరద్వాజ్ జడ్జీలుగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నారు.
అయితే కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్ సీజన్ 2కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో 'బలగం', 'కోర్టు' వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్న నటుడు, హీరో ప్రియదర్శి గెస్ట్ గా హాజరయ్యారు. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 'సారంగపాణి జాతకం' చిత్ర ప్రమోషన్ కోసం టీమ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. కాగా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రియదర్శి, దర్శకుడు మోహనకృష్ణ, హీరోయిన్ రూపా కొడవయూర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా షోకు వచ్చిన 'సారంగపాణి జాతకం' టీమ్ కు యాంకర్ శ్రీముఖి వెల్కమ్ చెబుతుంది. అయితే ప్రియదర్శి వచ్చి రాగానే మాట్లాడుతూ శేఖర్ మాస్టర్ ను సురేష్ అనే పేరుతో సంబోధిస్తాడు. దీంతో శేఖర్ మాస్టర్ షాక్ అవుతాడు. ఏంటీ.. సురేశ్ ఎవరు?.. మరీ దారుణం అంటూ ప్రియదర్శిని సరిచేసే ప్రయత్నం చేస్తాడు. పేరు తప్పుగా చెప్పడంతో ప్రియదర్శి కూడా నాలుక కరుచుకుంటాడు. ఏదేమైనా ఇండియాలోనే స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తున్న శేఖర్ మాస్టర్ పేరే మర్చిపోవడం హాట్ టాపిక్ గ్గా మారింది. తన మాటలతో అవమానించాడని శేఖర్ మాస్టర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రతి శని - ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో ప్రసారం అవుతుంది.


Click it and Unblock the Notifications











