అందరి ముందే షర్ట్ విప్పేసి రచ్చ.. సీనియర్ నటుడి చర్యతో యాంకర్ సుమ షాక్
ఈ మధ్య బుల్లితెరపై వచ్చే షోలో అందరూ వెరైటీ కోరుకుంటున్నారు. కొందరు లవ్ ట్రాకులు, పులిహోర బ్యాచ్‌లను ఎంకరేజ్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం అడల్ట్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్‌ను విచ్చల విడిగా వాడేస్తున్నారు. అయితే సుమ నిర్వహించే షోలో మాత్రం అలాంటివి కనిపించేవి కావు. కానీ ఈ మధ్య మాత్రం సుమ షోలోనూ ఇలాంటి వ్యవహారాలే ఎక్కువయ్యాయి. తాజాగా క్యాష్ షోలో నలుగురు విలన్లతో సుమ చేసిన రచ్చ వైరల్అవుతోంది.

నలుగురు గెస్ట్‌లు..
ప్రతీ వారం సుమ తన క్యాష్ షోలో నలుగురు అతిథులని తీసుకొస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక వారితో కలిసి సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. సుమ మీదు గెస్ట్‌లు కౌంటర్లు వేయడం, సుమ గెస్ట్‌ల మీద సెటైర్లు వేయడం షోలో సహజంగానే జరగుతూ ఉంటుంది.

పృథ్వీ ఎంట్రీ..
సీనియర్ నటుడు, హీరో, విలన్ అయిన పృథ్వీ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. మైండ్ బ్లాక్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ ఒక్కసారిగా షర్ట్ విప్పేశాడు. తన సిక్స్ ప్యాక్, బాడీ మెయింటైన్స్‌ను చూపించాడు. దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అయింది.

నిజంగానే మైండ్ బ్లాక్..
అలా పృథ్వీ షర్ట్ విప్పడంతో సుమ కౌంటర్ వేసింది. షర్ట్ విప్పి నిజంగానే మైండ్ బ్లాక్ చేసేశారంటూ, ఈ పాటకు నిజంగా సార్థకం చేసేశారంటూ కౌంటర్ వేసింది. ఫస్ట్ హాఫ్‌లోనే ఇలా షర్ట్ విప్పేశాడంటే.. అంటూ మరో సెటైర్ వేసేసింది.

పూలు, అమ్మాయిలు..
పృథ్వీ గురించి సుమ చెబుతూ.. ఆయనకు పూలు, అమ్మాయిలను చూపించడయ్యా అని చెప్పుకొచ్చింది. హా చూశాను.. అంటూ సుమ వైపు తిరిగాడు పృథ్వీ. దెబ్బకు సుమ భయపడి వెనక్కి వెళ్లింది. మొత్తానికి నన్నుఅమ్మాయి అని ఒప్పుకున్నాడంటూ సుమ మరో పంచ్ వేసింది.
Recommended Video
రెమ్యూనరేషన్ గురించి..
మార్నింగ్ ఏం తాగుతారంటూ పృథ్వీని సుమ అడిగితే.. తోటపల్లి మధు మధ్యలోకి ఎంట్రీ అయ్యాడు. ఆయన ఏమీ తాగడు.. ఓన్లీ రెమ్యూనరేషన్ తీసుకుంటాడని కౌంటర్ వేశాడు. ఆడుతూ పాడుతూ రెమ్యూనరేషన్ తీసుకుంటే ఎవ్వరైనా ఆనందంగా సంతోషంగా స్లిమ్ముగానే ఉంటారంటూ తోటపల్లి మధు కౌంటర్లు వేశాడు.


Click it and Unblock the Notifications











