నటుడు సాయి కిరణ్ కు టోకరా... అడిగితే బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు!

నటుడు, గాయకుడు సాయి కిరణ్ తెలుగువారందరికీ సుపరిచితమే. హీరోగా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన తర్వాత కాలంలో సినిమాలకు దూరమయ్యారు. అయినా బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. ప్రస్తుతం గుప్పెడంత మనసు వంటి కొన్ని సీరియల్స్ లో నటిస్తున్న ఆయన తాజాగా ఇద్దరు నిర్మాతల మీద పోలీస్ కేసు నమోదు చేయడం బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాయకుడు అయిన తండ్రి విశ్వంరాజు రామకృష్ణ సినీ వారసుడిగా రంగప్రవేశం చేసిన సాయి కిరణ్ నువ్వే కావాలి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించగా సెకండ్ హీరోగా సాయి కిరణ్ నటించారు. ఈ సినిమాలో ఉన్న అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది అనే పాటలో సాయి కిరణ్ నటించి తెలుగు ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత సాయి కిరణ్ ప్రేమించు, మనసుంటే చాలు, సత్తా వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టిన ఆయన తెలుగు, తమిళ, మలయాళ బుల్లితెర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు కూడా తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నారు. అలాగే గతంలో కోయిలమ్మ, సుడిగుండాలు, శివలీలలు, సూర్య భగవాన్, అభిలాష వంటి సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన లెజెండరీ సింగర్ పి సుశీల సొంత మనవడు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే తాజాగా ఆయన నిర్మాతలైన జాన్ బాబు, లివింగ్స్టన్ అనే ఇద్దరు వ్యక్తుల మీద ఫిర్యాదు చేశారు. వారు ఇద్దరూ తన దగ్గర పది లక్షల 60 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తిరిగి ఇవ్వాలని అడిగితే తనపై బెదిరింపులకు దిగుతున్నారని సాయి కిరణ్ ఆరోపించారు.

Actor sai kiran lodges cheating complaint against producers john babu and livingston.

ఈ మేరకు ఆయన జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. చివరిగా సప్తగిరి ఎల్ ఎల్ బి అనే సినిమాలో నటించిన ఆయన ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్ర భూషణ్ అనే పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతకుముందు ఆయన ఇంటిగుట్టు అనే సీరియల్ లో అజయ్ అనే పాత్రలో కూడా నటించారు. ఇక తన సినీ, సీరియల్ జీవితంలో అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న సాయి కిరణ్ ఇప్పుడు నిర్మాతలు చేతిలో మోసపోవడం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X