47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. ఘనంగా సీరియల్ హీరోయిన్ సీమంతం..

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఒక్కో సెలబ్రిటీ వరుసగా శుభవార్తలు చెబుతున్నారు. ఇటీవల వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన జంట రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారని ప్రకటించారు. బాలీవుడ్ వైపు చూసినా పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా జంట తమ జీవితంలో బాబును స్వాగతించారు. ఇలాగే సంతోషకరమైన వార్తల జాబితాలో తాజాగా తెలుగు టెలివిజన్ నటుడు సాయికిరణ్ (Sai Kiran) కూడా చేరాడు.

టాలీవుడ్, టెలివిజన్ రంగాల్లో పేరుపొందిన నటుడు సాయికిరణ్ (Sai Kiran) జీవితంలో మరో సంతోషకర ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నారు. 47 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న ఈ నటుడు ప్రస్తుతం బుల్లితెరపై వరుస సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన భార్య, నటి స్రవంతి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ హ్యాపీ మూమెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Actor Sai Kiran to Become a Father at 47 Grand Baby Shower for Wife Sravanthi Goes Viral

ఘనంగా సీమంతం వేడుక
సాయికిరణ్ భార్య స్రవంతి గర్భిణి. దీంతో స్రవంతి కుటుంబ సభ్యులు సీమంతం వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్రవంతి సాంప్రదాయ వేషధారణలో, పట్టుచీరలో, నగలతో మెరిసిపోయారు. స్టేజీపై కూర్చుని సీమంతం జరుపుకుంటున్న సమయంలో భర్త సాయికిరణ్ ఆమెకు గాజులు తొడిగి ఆశీర్వదించారు. ఈ ఘట్టం చూసి అక్కడి అతిథులంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫంక్షన్‌కు బంధుమిత్రులు, సీరియల్ టీమ్స్, దగ్గరి స్నేహితులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

కోయిలమ్మ జంట నుంచి నిజ జీవిత జంటగా
సాయికిరణ్, స్రవంతి ఇద్దరూ కలిసి ప్రసిద్ధ సీరియల్ 'కోయిలమ్మ'లో నటించారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరూ 2023 డిసెంబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత సాయికిరణ్‌ తన భార్యను ప్రతి సందర్భంలో ప్రోత్సహిస్తూ, సోషల్ మీడియాలో ఆమెపై ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల స్రవంతి తన భర్తకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటియర్ 650 బైక్ గిఫ్ట్‌గా ఇవ్వడం వార్తల్లో నిలిచింది. "నా భర్తకు కంగ్రాట్స్, మా ఫ్యామిలీకి కొత్త మెంబర్ వచ్చాడు" అని స్రవంతి రాసుకొచ్చారు. ఈ గిఫ్ట్‌తో సాయికిరణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు.

సాయికిరణ్ సినీ, టీవీ ప్రయాణం
సాయికిరణ్ తండ్రి ప్రముఖ సింగర్ రామకృష్ణ, తల్లి జ్యోతి కూడా గాయని. అంటే ఆయన లెజెండరీ సింగర్ పి. సుశీల గారి మనవడు. చిన్నప్పటి నుంచే కళారంగంపై ఆసక్తి ఉన్న సాయికిరణ్ తొలుత హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. రామోజీరావు నిర్మించిన 'నువ్వే కావాలి' సినిమాలో సెకండ్ హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు', 'గోపి గోడమీద పిల్లి', 'జగపతి', 'షిరిడీ సాయి', 'బింబిసార' వంటి చిత్రాల్లో నటించాడు.

అయితే పెద్దగా సినీ ప్రయాణం కలిసి రాకపోవడంతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టాడు. 'శివలీలలు' సీరియల్‌లో విష్ణుమూర్తి పాత్రతో ప్రారంభమైన ఆయన బుల్లితెర ప్రయాణం అద్భుతంగా సాగింది. 'అభిలాష', 'ఇంటిగుట్టు', 'గుప్పెడంత మనసు', 'మౌనరాగం', 'పడమటి సంధ్యారాగం', 'కోయిలమ్మ' వంటి హిట్ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఇటీవల 'గుప్పెడంత మనసు'లో మహేంద్ర పాత్రలో నటించి మరోసారి స్టార్‌డమ్‌ను అందుకున్నాడు.

సాయికిరణ్ తొలి భార్య వైష్ణవి. వీరి వివాహబంధంలో విభేదాలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోయాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. విడాకుల తర్వాత స్రవంతిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు సాయికిరణ్. ఇప్పుడు వీరిద్దరూ తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నారు. స్రవంతి గర్భవతిగా ఉండటంతో సాయికిరణ్ తండ్రిగా కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ జంట.. త్వరలో పేరెంట్స్ గా ప్రమోషన్స్ పొందబోతున్నారు. అభిమానులు, సహచరులు సోషల్ మీడియాలో సాయికిరణ్-స్రవంతి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

More from Filmibeat

Read more about: tollywood sai kiran sravanthi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X