Bigg Boss 7 Telugu షకిలమ్మా.. ఎవరైనా తొక్కిపడేయ్.. శివమెత్తిన శివాజీ
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో రెండోవారం టాస్కులతో షో ఊపందుకొన్నట్టు కనిపిస్తున్నది. ఇంటిలోని కంటెస్టెంట్లను హౌస్‌మేట్స్‌గా మార్చేందుకు బిగ్‌బాస్ రకరకాల పరీక్షలు పెడుతున్నారు. ఇప్పటికే పవర్ అస్త్ర టాస్క్‌తో ఆటను కొనసాగిస్తుండగా రెండోవారంలో మాయ ఆస్త్రను తెరపైకి తెచ్చాడు. ఈ రెండు టాస్క్‌లతో గేమ్ ఆసక్తికరంగా సాగుతున్న క్రమంలో బిగ్‌బాస్ పెట్టిన ఫిట్టింగ్‌తో యాక్టర్ శివాజీ ఉగ్రరూపం దాల్చాడు. తాజా ప్రోమోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ఇంటిలో తెలుగు భాషనే మాట్లాడాలనే నియమాన్ని ఉల్లంఘించే వారికి శిక్షను భారీగా విధిస్తుంటాడు. తాజాగా కోల్‌కతాకు చెందిన కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ ఇతర భాషల్లో మాట్లాడుతుంటే బిగ్‌బాస్ కొరడా ఝుళిపించాడు. తాను పంపిన సందేశాన్ని తదుపరి ఆదేశం వరకు ఆపకుండా చదవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దాంతో ప్రిన్స్ యావర్ తెలుగులో క్షమాపణలు కోరుతూ బిగ్‌బాస్ పంపించిన సందేశాన్ని పంపించడం మొదలుపెట్టాడు.

తెలుగు కాకుండా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడినందుకు హృదయపూర్వకంగా క్షమాపణ కొరుతున్నాను అంటూ ప్రిన్స్ యావర్ చదవడం మొదలుపెట్టాడు. అంతలో కొందరు యావర్‌ను డిస్ట్రబ్ చేసేందుకు ప్రయత్నించారు. అది గమనించిన శివాజీ, వెంటనే స్పందిస్తూ.. యావర్‌ను ఎవరూ డిస్ట్రబ్ చేయవద్దు అంటూ అరిచాడు. అంతలోనే టెస్టీ తేజ డిస్ట్రబ్ చేస్తున్నట్టు శోభాశెట్టి చెప్పింది. దాంతో అరేయ్ తేజా ఆపురా.. పద్దతి కాదు.. ఓ మనిషికి టాస్క్ ఇచ్చిన తర్వాత ఆపకూడదు అంటూ శివాజీ అరిచాడు.
అయితే అంతలోనే ఇంటిలో ఏదో గొడవ జరిగింది. దాంతో షకీలా రంగంలోకి దిగింది. అది చూసి షకీల అమ్మ రంగంలోకి దిగింది అని తేజా అంటే.. అమ్మా తొక్కిపడేయ్.. ఎవరైనా సరే అని శివాజీ అన్నాడు. ఇది బిగ్‌బాస్ ఆడించే ఆట.. అతడికి తెలుసు అంటూ తేజా మధ్యలో దూరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. శివాజీ శివమెత్తాడు.
టేస్టీ తేజా, ఇతర ఆటగాళ్లకు సమాధానం చెబుతూ.. నేను కూడా ఆడుతా. నాకు కూడా అలవాటే.. నేను కూడా విసిరి వేస్తాను. మీరంతా వైలెంట్ గేమ్ కాదన్నారు కదా.. నేను కూడా వైలెంట్ గేమ్ ఆడుతాను అంటూ యాక్టివిటి ఏరియాలో ఉన్న డంబెల్స్, ఎక్సర్‌సైజ్ చేసే వస్తువులను విసిరేస్తూ శివమెత్తిన శివాజీలా కనిపించాడు. తాజాగా విడుదల చేసిన వీడియో ఫుల్ ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచింది.


Click it and Unblock the Notifications











