Shivaji : నెలకు రూ.10లక్షలు నష్టపోయిన పల్లవి ప్రశాంత్.. అందుకే సపోర్ట్ చేశానంటూ శివాజీ సంచలనం

బుల్లితెరపై అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న షోల్లో బిగ్ బాస్. అయితే ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కొనసాగగా.. అందులో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. పల్లవి ప్రశాంత్.. ఓ కామన్ మ్యాన్ గా, రైతుబిడ్డగా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టి విజేతగా నిలిచి ప్రభంజనం సృష్టించాడు. అయితే పల్లవి ప్రశాంత్ మొదటి నుంచి శివాజీ సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. దానికి కారణాన్ని ఇటీవల ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పల్లవి ప్రశాంత్... బిగ్ బాస్ షోకి ముందు ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియదు. ఓ నార్మల్ మ్యాన్.. ఎప్పటి నుంచో బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాలని పరితపించాడు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ.. కాళ్లు అరిగేలా తిరిగాడు. ఎన్నో సార్లు.. బిగ్ బాస్ ఆడియెన్ లాగా వెళ్లి అక్కడ సందడి చేశాడు. బిగ్ బాస్ షోకి పంపించాలంటూ.. తన య్యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వీడియోల్లో వేడుకున్నాడు. రైతు బిడ్డను పంపించండి అంటూ ప్రాధేయపడ్డాడు.

Actor Shivaji Comments on Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth News Goes Viral

ఇక ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్... శివాజీ కంట్లో పడ్డాడు. ఇక మొదటి రోజు నుంచే శివాజీ.. పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ ఇస్తూ అండగా నిలిచాడు. చేసే పనిలో, ఆటలో సలహాలు ఇస్తూ.. శివాజీ.. ప్రశాంత్ కు కొండంత అండగా నిలిచాడు. ఇక శివాజీ లేకపోతే.. ప్రశాంత్ విజేత అయ్యేవాడు కాదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇదిలా ఉంటే.. శివాజీ చాలా రోజుల తర్వాత ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఇక ఆ ఇంటర్వ్యూలో శివాజీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ... ఆ కుర్రాడు చాలా అమాయకుడు. ఎంతంటే.. తనకు ఉన్న యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి కదా.. వాటికి లక్షల్లో సబ్ స్క్రైబర్స్ ఉన్నాయి. అయితే ఆ ఛానెల్స్ ను మానిటైజ్ చేసుకుంటే డబ్బులు వస్తాయనే విషయం కూడా అతనికి తెలియదు. ఆ విషయం కూడా అతనికి ఎవరు చెప్పలేదు.. అంటూ చెప్పుకువచ్చాడు.

Actor Shivaji Comments on Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth News Goes Viral

ఇలా ప్రశాంత్ నెలకు దాదాపు రూ.10లక్షల రూపాయలు కోల్పోయాడు. మానిటైజ్ చేసుకోకపోవడం వల్ల చాలా డబ్బులను నష్టపోయాడు. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఉన్న అకౌంట్స్ ను మానిటైజేషన్ చేసి ఇచ్చాను. అవి చేసుకోవాలనే విషయం కూడా అతనికి తెలియదు. అంత అమాయికుడు. అందుకే అతనికి నేను సపోర్టుగా నిలిచాను అంటూ శివాజీ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చాడు.

ఇక శివాజీ తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. తనకు ప్రశాంత్ కంటే ఎక్కువ డబ్బులు వచ్చాయని చెప్పుకువచ్చాడు. నేను గెలవకపోయినా పర్వాలేదు.. ప్రశాంత్ గెలుపు నాకు సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించాడు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శివాజీ, యావర్, ప్రశాంత్ ముగ్గురు కలిసి త్వరలో ఓ షార్ట్ ఫిలిం చేయబోతున్నట్లు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X