SPY in Bigg Boss Telugu 7 బిగ్‌బాస్ ఇంటిలో కొత్త స్పై గ్రూప్.. అఫీషియల్‌గా బయటపెట్టిన టాప్ కంటెస్టెంట్!
దేశంలోని అతిపెద్ద గేమ్ షో బిగ్‌బాస్ తెలుగు 7 ముగింపు దశకు చేరుకొన్నది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా ప్రారంభమైన ఈ రియాలిటీ 10వ వారం ముగింపునకు చేరుకొన్నది. అయితే 11వ వారం ఆట కోసం శివాజీ కెప్టెన్‌గా మారడం ఇంటి సభ్యులను ఆనందానికి గురిచేసింది. అయితే కెప్టెన్ ఎంపికైన తర్వాత శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం శివాజీ స్పై టీమ్ అంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ స్పై (SPY) టీమ్ అంటే ఏమిటి? అందులో ఎవరు ఉన్నారనే విషయంలోకి వెళితే...
బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 11వ వారం కోసం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో చివరకు శివాజీ, అంబటి అర్జున్ మిగిలారు. అయితే కన్ఫెషన్ రూమ్‌లోకి కంటెస్టెంట్లను పిలిచి ఇద్దరిలో ఇంటికి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని అడిగారు. ఇంటిలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా శివాజీ పేరు ప్రతిపాదించడంతో ఆయనను కెప్టెన్‌గా నాగార్జున ప్రకటించారు.

అయితే తనను ఏకగ్రీవంగా కెప్టెన్‌గా ప్రకటించడంతో శివాజీ ఆనందంలో మునిగిపోయారు. ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకొన్నారు. కానీ తన ఆనందాన్ని ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌తో కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకొన్నాడు. ఈ సందర్బంగా SPY అంటూ కొత్త గ్రూపును ఇంటిలో పరిచయం చేశారు.
శివాజీ మాట్లాడుతూ.. ఇంటిలో మనం ముగ్గురు SPY. SPY అంటే Shivaji, Prashanth, Yawar అంటూ ఆనందంతో అరిచాడు. శివాజీ చెప్పిన విషయానికి ప్రశాంత్, యావర్ కూడా స్పందించి సంతోషంలో మునిగిపోయారు. ఇలా ఇంటిలో కొత్తగా ఓ గ్రూపు అఫీషియల్‌గా క్రియేట్ అయింది.

ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో సీరియల్ బ్యాచ్ అంటూ అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ ఓ గ్రూప్‌గా ముద్రపడింది. సోషల్ మీడియాలోనే కాకుండా హోస్ట్ నాగార్జున కూడా పలు సందర్భాల్లో పరోక్షంగా ఎత్తి చూపారు. ఇప్పటి వరకు గ్రూపుగానే శివాజీ ఆడినప్పటికీ.. తాజాగా ఆఫిషియల్‌గా ఆయనే బయటపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 10వ వారం ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం ఇంటి నుంచి భోలే షవాలీ బయటకు వచ్చారు. అందరూ ఊహించినట్టే భోలే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇంటిలో టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఇక రానున్న రోజుల్లో ఎలిమినేషన్లు సంచలనంగా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











