Bigg Boss Telugu 7 బిగ్‌బాస్ విజేతను నేనే.. ఏం జరిగిందో నాకు తెలుసు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ అట్టహాసంగా ముగిసింది. దాదాపు 105 రోజులపాటు సాగిన ఈ రియాలిటీ షో ఎన్నో ట్విస్టులతో, వినోదంతో సాగడమే కాకుండా ఎన్నో అనుభూతులను మిగిల్చింది. ఇంటిలో దాదాపు 17 మంది కంటెస్టెంట్లు తమ ఆట తీరుతో మెప్పించే ప్రయత్నం చేశారు. ఇంటిలో మైండ్ గేమర్‌గా పేరున్న యాక్టర్ శివాజీ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ బజ్ కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ..
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు 7 విన్నర్ నేనే. కానీ నేను విజేతగా కాకపోవడానికి ఏం జరిగిందో నాకు తెలుసు. టాప్ 3 స్థానం కాకుండా నా స్థానం ఏమిటో తెలుసు. ఆ స్థానంతో నేను సరిపెట్టుకోను. కానీ ఓ కుట్ర జరిగితే దానికి అడ్డుపడ్డాను. నేను గెలువకపోయినా నాకేమీ పర్వాలేదు అని శివాజీ అన్నారు.

ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ను ఆడనివ్వకుండా చేయాలనే కుట్రను నేను అడ్డుకొన్నాను. మొదటి రోజు ఓ గ్రూప్ చేసిన కుట్రలు, సంకల్పానికి నేను అడ్డుగా నిలిచాను. యావర్, పల్లవి ప్రశాంత్ వెనుక ఓ శక్తి ఉందనే సిగ్నల్‌ను ఇంటిలో అందరికి, ప్రేక్షకులకు పంపించాను అని శివాజీ అన్నారు.
ప్రశాంత్, యావర్‌కు గానీ, ప్రేక్షకుల మనసులో లేని ఆలోచనను కల్పించారనే విమర్శపై శివాజీ ఘాటుగా స్పందించారు. మీరు ఏది అడిగితే అది చెప్పడానికి నేను లేను. నాకు అనిపించింది. నా మనసుకు నచ్చినది. నాకు అనిపించినది నేను చేశాను అని శివాజీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
అమర్‌దీప్‌పై మొదటి రోజు నుంచి ఎటాక్ చేశారంటే నేను ఒప్పుకొను. అమర్ దీప్ నేను చాలా క్లోజ్. అమర్ కెప్టెన్ కాకుండా ప్రయత్నాలు చేశానా? లేదా అనే బయట జనం చూస్తున్నారు. ఎవరు కలిసి ఆడారు? ఎవరు కలిసి ఆడలేదో వారికి తెలుసు అని అన్నారు.
బిగ్‌బాస్ తెలుగు 7 ట్రోఫి కొట్టడానికి, విజేతగా కావడానికి నేను రాలేదు. శివాజీ అంటే బిగ్‌బాస్ చరిత్రలో ఎవరికీ లేని మార్కు ఉండాలని కోరుకొన్నాను. అందుకోసమే నేను ప్రయత్నించాను. నేను ఆడిన ఆటతో సంతృప్తి చెందాను. నా ఆట విషయంలో నాకే కంప్లయింట్స్ లేవు అని శివాజీ చెప్పారు.
ఇదిలా ఉండగా, శివాజీ అండగా నిలిచిన పల్లవి ప్రశాంత్ సీజన్ 7వ విజేతగా నిలిచారు. అలాగే యావర్ 15 లక్షల రూపాయల సూట్‌కేస్‌తో సెల్ఫ్ ఎలిమినేషన్‌తో బయటకు వచ్చారు. కనీసం రెండోస్థానంలో ఉంటారని అనుకొన్న శివాజీ మూడో స్థానానికి జారిపోయారు. ఇలా కామన్ మేన్‌గా ఆటను ప్రారంభించిన ప్రశాంత్‌ను విజేతను చేయడంలో శివాజీ తన వంతు పాత్రను సమర్ధవంతంగా పోషించారు.


Click it and Unblock the Notifications











