Bigg Boss Telugu 7 కోట్లు పొగొట్టుకొన్నా.. బిగ్‌బాస్ టైటిల్ నాకు లెక్క కాదు.. శివాజీ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో టైటిల్ వేట మొదలైంది. ఇంటిలో చివరివారం టాప్ 6 కంటెస్టెంట్లు మిగిలారు. టాప్ 7 కంటెస్టెంట్లలో శోభాశెట్టి ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో బలమైన ఆరుగురు కంటెస్టెంట్లు మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారింది. బిగ్‌బాస్ టైటిల్ గురించి శివాజీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే టైటిల్ రేసులో ఎవరున్నారు? అనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో గత సీజన్లకు భిన్నంగా శివాజీ తన మార్కును వదిలారనే చెప్పాలి. ఇంటిలో పెద్దన్నగా, పెద రాయుడి ఇమేజ్‌తో కంటెస్టెంట్లకు పెద్ద దిక్కుగా మారారనే ఫీలింగ్ కల్పించారు. ఈ క్రమంలో SPY (Shivaji, Prashanth, Yawar) గ్రూప్ అంటూ ముద్ర పడింది. అయితే ముగ్గురు కలిసి ఆడిన గేమ్ కొంత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

 Actor Shivaji Viral comments on Bigg Boss Telugu 7 Title after Shobha Shetty Elimination

అయితే బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో శివాజీ గేమ్ చాలా కూల్‌గా, బ్యాలెన్స్‌గా ఆడిన ఫీలింగ్ కల్పించాడు. అయితే ఇంటిలో లైన్ క్రాస్ చేయకుండా బిహేవ్ చేశాడు. అయితే 13వ వారం చివర్లో శోభాశెట్టితో గొడవ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయాడనే ఫీలింగ్ కలిగింది. అయితే గొంతుపై కాలేసి తొక్కుతా అంటూ శోభాశెట్టిపై చేసిన కామెంట్లను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడు.

అయితే శోభాశెట్టి ఎలిమినేషన్ తర్వాత తనలోని అసహనం మరోసారి కనిపించింది. తనను శోభాశెట్టి చాలా తీవ్రంగా వేధించింది. ఆమె తన పట్ల ప్రవర్తించిన తీరు నాకు బాధ కలిగించింది. అందుకే అలా రియాక్ట్ కావాల్సి వచ్చింది అంటూ యావర్, ప్రశాంత్‌తో తన ఆవేదనను వెల్లగక్కాడు.

 Actor Shivaji Viral comments on Bigg Boss Telugu 7 Title after Shobha Shetty Elimination

అయితే తాను ఎంతో జీవితాన్ని చూశాను. కానీ ఇలాంటి పరిస్థితి చూడలేదు. నేను టైటిల్ గెలవాలని రాలేదు. నేను కోట్లు పోగొట్టుకొన్నాను. తిరిగి కోట్లు సంపాదించుకొన్నాను. డబ్బు కోసమో.. టైటిల్ కోసమో నేను రాలేదు.కేవలం నేను ఎక్స్‌పీరియెన్స్ కోసం మాత్రమే వచ్చాను అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు చర్చనీయాంశమయ్యాయి.

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 7 ఫినాలేకు భారీ హంగులతో రంగం సిద్దమవుతున్నది. ఇంటిలో టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్, ప్రియాంక జైన్ ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారో కొద్ది రోజులు ఆగితే క్లారిటీ రావడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X