Bigg Boss Telugu 7: శివాజీ డబుల్ మీనింగ్ డైలాగులు - ఓవైపు ప్రియాంక, మరోవైపు అశ్వినీతో ఫుల్ రొమాన్స్!
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. అదిరిపోయే టాస్కులు, అంతకు మించిన ఎమోషన్స్ తో అందరినీ టీవీల ముందు కూర్చోబెడుతుంది. ముఖ్యంగా నిన్న వచ్చిన ఎపిసోడ్ మాత్రం అదిరిపోయిందనే చెప్పొచ్చు. గ్రహాంతర వాసులను సంతృప్తి పరిచే టాస్కులో అయితే కంటెస్టెంట్లు అందరూ ఇరగదీశారు. ముఖ్యంగా శివాజీ రెండు గ్రామాలకు పెద్దగా చాలా బాగా చేశారు. కేవలం పెద్ద మనిషిగానే కాకుండా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ అందరినీ షాక్ కు గురి చేశారు. ఎవరికి వాళ్లు తమ స్థాయికి తగ్గట్లుగా టాస్కులో పాల్గొని అద్భుతమైన కామెడీని పండించారు.
ముఖ్యంగా ప్రియాంక జైన్, అశ్వినీ శ్రీలు అయితే తమ అందాలను అబ్బాయిలకు ఎరగా వేస్తూ అదిరిపోయే క్యారెక్టర్లలో కనిపించి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. అశ్విని శ్రీ పల్లెటూరి అందమైన అమ్మాయి క్యారెక్టర్ లో కనిపించగా.. అమర్ దీప్ పాన్ షాప్ యజమానిగా, ఆయనకు కాంపిటేషన్ గా సందీప్, అర్జున్ గల్లీ రౌడీగా, ప్రశాంత్ అర్జున్ వెంట తిరిగే కుర్రాడిగా చాలా బాగా చేశారు. ఈక్రమంలోనే అశ్వినీ వెంట గ్రామంలోని యువకులు అంతా వెంటపడతారు. అలాగే శోభా శెట్టి సర్పంచిగా, విడాకులు తీసుకున్న ఆమె భర్తగా టేస్టీ తేజ, పల్లెటూరి అమ్మాయి కోసం వెతుకుతున్న ఎన్నారైగా యావర్ ఇరగదీశారు. అలాగే సర్పంచిని ప్రేమిస్తున్న రోడ్ సైడ్ రోమియోగా గౌతమ్ కూడా బాగానే చేశాడు.

ముఖ్యంగా అశ్వినీ శ్రీ తన అందచందాలను చూపిస్తూ అదరగొట్టింది. అలాగే ప్రియాంక జైన్ ఆమెకు పోటీగా కుర్రాళ్లతో రొమాంటిక్ గా మాట్లాడుతూ.. తనవైపు తిప్పుకుంటూ కనిపించింది. ఈక్రమంలోనే శివాజీ ప్రియాంకతో మాట్లాడుతూ.. ఈ జ్యువెల్లరీ చాలా బాగుందని అంటాడు. అలాగే నువ్వు కూడా అందంగా ఉన్నావు.. ఓసారి మా ఇంటికి రావచ్చుగా అంటూ మాట్లాడతాడు. అందుకు ప్రియాంక తెగ సిగ్గుపడిపోతూ.. ఈ జ్యువెల్లరీ గతంలో మీరే కొనిచ్చారని చెబుతుంది. ఈక్రమంలోనే సందీప్ వచ్చి ఏంటి సర్పంచ్ కే సున్నం రాయాలని చూస్తున్నారు అంటాడు.

దీనికి శివాజీ.. సందీప్ ను దగ్గరకు లాక్కొని మాకూ సున్నం ఉంది కదా.. ఆకు మీద రాయాలి కదా అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టాడు. ఆ తర్వాత అశ్వినీ శ్రీని చూసిన శివాజీ.. ఓయ్ పిల్లా అంటూ నవ్వుతాడు. బాగున్నావా అని అడగ్గా... హా నేను బాగున్నానని చెబుతూనే అశ్వినీ తెగ సిగ్గుపడిపోతుంది. మీరెలా ఉన్నారని అంటుంది. అంతలోపే శివాజీ... ఈఊరును ఓ ఊపు ఊపేస్తున్నావట అని అంటాడు. అందుకు అశ్వినీ.. ఇంత అందగత్తెను మరి ఆ మాత్రం ఊపనా ఏంటి అంటూ నడుమంతా ఊపేస్తుంది. అది చూసిన శివాజీ... ఓ సారి తోటలోకి రా నీ అందం చూద్దాం అంటాడు. అందుకు అశ్వినీ నవ్వుతూ వస్తాలే అంటుంది.

అలా సాగిన ఈ టాస్కు చాలా అద్భుతంగా ఉంది. అందరూ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ రచ్చ చేసినప్పటికీ.. చాలా బాగా అనిపించింది. ఈ టాస్కు చూసిన అభిమానులు పెద్ద ఎత్తున ఖుషీ అయ్యారు. ఈ సీజన్ లో వచ్చిన అద్భుతమైన ఎంటర్ టైనింగ్ టాస్కు అంటే ఇదే అంటూ కామెంట్లు చూస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ కనుక మీరు చూడకపోతే వెంటనే వెళ్లి ఓ లుక్కేసేయండి. శివాజీ డబుల్ మీనింగ్ డైలాగులు, అశ్వినీ, ప్రియాంకలతో చేసిన రొమాన్స్ కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











