Bigg Boss Telugu 7: చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న శివాజీ.. ఏమేం చేసేవాడో చెబుతూ ఎమోషనల్

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 2.0 కు విపరీతమైన టీఆర్పీతో దూసుకెళ్తోంది. రాత్రి 9 గంటలు అయిందంటే చాలు.. చాలా మంది ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతున్నారు. ఈక్రమంలోనే బిగ్ బాస్ షోను చూస్తూ తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ.. షో చూస్తున్నారు. ముఖ్యంగా తమకు నచ్చిన కంటెస్టెంట్లు ఏం మాట్లాడినా సరే జాగ్రత్తగా వింటున్నారు. వారు చేసే అల్లరి, ఆడే టాస్కులు, వారు చెప్పే ప్రతీ మాటను మనసులో దాచుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఆట బాగా ఆడుతూ.. చాలా మంది అభిమానుల్ని సంపాధించుకున్న శివాజీ తన బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నాడు.

బిగ్ బాస్ ఇంట్లోని డైనింగ్ టేబుల్ పై కూర్చొని.. చిన్నప్పుడు జీవితం చాలా బాగుండేదని కంటెస్టెంట్లకు చెప్పాడు శివాజీ. అప్పుడు కోతి కొమ్ముచ్చి, ఇసుకలో కబడ్డీ, ఇతర ఆటలు ఆడుకునే వాళ్లమని చెప్పుకొచ్చాడు. శివాజీ చెబుతున్న మాటలు వింటూ అంతా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా అమర్ దీప్, భోలె షవాళి, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, గౌతమ్, అశ్వినీ చాలా చక్కగా విన్నారు. చిన్నప్పుడు కర్ర పట్టుకొని ఎంతో దూరం దూకేవాళ్లమంటూ వివరించాడు. అలాగే స్కూళ్లో ఉండే బాజీబాబా చెట్టు ప్రస్తుతం ఊళ్లో ఇవేవీ లేవంటూ ఎమోషనల్ అయ్యాడు.

Actor Sivaji Shares His Childhoos Memories With Contestants in Bigg Boss Telugu 7 Show

శివాజీ తన చిన్నప్పటి విషయాలు, ఆడుకున్న ఆటలు గురించి వివరిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి అంటూ సాగే మ్యూజిక్ వేసి బిగ్ బాస్ టీం విడుదల చేసిన వీడియో అయితే మరింత అదిరింది. కొన్ని గంటల క్రితమే విడుదల చేసిన ఈ వీడియోకు 5 లక్షకు పైగా లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ముఖ్యంగా శివాజీ అభిమానులు పెద్ద ఎత్తున ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వారు కూడా తమ బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.

బిగ్ బాస్ షోకు వచ్చిన శివాజీని చూస్తే గతంలో అమర్ దీప్ చాలా నెగిటివ్ గా ఫీలయ్యేవాడు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్లు వచ్చినప్పటి నుంచి... ముఖ్యంగా కింగ్ నాగార్జున బాగా ఫైర్ అయినప్పటి నుంచి శివాజీపై పెద్దగా ఫైర్ అవ్వట్లేదు. 2.0 స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే అమర్ దీప్ లో చాలా మార్పు వచ్చింది. అమర్ దీప్ అండ్ టీం అంటే శోభా శెట్టి, ప్రియాంకలు కూడా చాలా మారిపోయారు. శివాజీతో చాలా బాగా ఉంటున్నారు. ఒక గౌతమ్ మాత్రమే కాస్త ఎక్కువ చేస్తున్నాడు. కానీ శివాజీ వీటన్నిటినీ తట్టుకుంటూ తన గేమ్ తాను ఆడుతున్నాడు.

Actor Sivaji Shares His Childhoos Memories With Contestants in Bigg Boss Telugu 7 Show

ముఖ్యంగా టేస్టీ తేజతో శివాజీ బాండింగ్ చాలా బాగుంది. వీరిద్దరూ మాట్లాడుుకనే మాటలు, చేసే అల్లరి అయితే అంతా ఇంతా కాదు. అలాగే ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ల కోసం శివాజీ ఏం చేయడానికైనా సిద్ధపడే తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంట్లో ఓ పెద్ద మనిషిలా వ్యవహరిస్తూనే.. అనేక చలాకీ పనులు చేస్తున్నాడు. ఏది ఏమైనా శివాజీ క్యారెక్టర్ కు ఆయన వ్యవహరించే తీరుకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X