దీప్తి సునయన-షణ్ముఖ్ పెళ్లి.. అసలు నిజాన్ని బయటపెట్టిన సూర్య వెబ్ సిరీస్ యాక్టర్

దీప్తి సునయన-షణ్ముఖ్ జశ్వంత్ లపై గత కొన్నేళ్లుగా వస్తున్న రూమర్స్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఎన్ని ఉదాహరణలు బయటకు వచ్చినా కూడా వీరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నోసార్లు లవ్ బర్డ్స్ గా బుల్లితెరపై జనాలను కన్ఫ్యూజన్ కు గురి చేశారు. ఇక మొత్తానికి అసలైన వ్యక్తి వీరి మధ్య ఉన్న మ్యాటర్ పై వివరణ ఇచ్చారు.

యూ ట్యూబ్ కంటెంట్ తో భారీ క్రేజ్

యూ ట్యూబ్ కంటెంట్ తో భారీ క్రేజ్

దీప్తి సునయన-షణ్ముఖ్ కెరీర్ మొదటి నుంచి కూడా జనాలకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా షణ్ముఖ్ వైవా హర్ష వెబ్ సిరీస్ నుంచి కూడా యువతకు కనెక్ట్ అయ్యాడు. అతని వెబ్ సిరీస్ లకు రోజురోజుకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. ముఖ్యంగా సూర్య వెబ్ సిరీస్ కు మిలియన్ల వ్యూవ్స్ దక్కాయి. యూ ట్యూబ్ కంటెంట్ తోనే కాకుండా డ్యాన్స్ తో కూడా బాగానే ఎట్రాక్ట్ చేస్తూ వచ్చాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా

ఇక దీప్తి సునయన కూడా నేటి తరం జనరేషన్ కు బాగా తెలిసిన బ్యూటీ. మొదట సోషల్ మీడియా ద్వారా తన క్రేజ్ ను కొంచెం కొంచెంగా పెంచుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ద్వారా మరింత పబ్లిసిటీ తెచ్చుకుంది. హౌజ్ లో ఆమె హడావుడికి అప్పట్లో నెగిటివ్ కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.

కొన్నాళ్లకే చాలా క్లోజ్ అయ్యారు

కొన్నాళ్లకే చాలా క్లోజ్ అయ్యారు

ఇక యూ ట్యూబ్ కంటెంట్ కోసం, కవర్ సాంగ్స్ కోసం వర్క్ చేసినా ఈ జంట కొన్నాళ్లకే చాలా క్లోజ్ అయ్యారు. వారు కలుసుకున్న ప్రతి సారి కూడా రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతూ వస్తున్నాయి. టీవీ ప్రోగ్రాంలలో కూడా ఈ జంటను లవర్స్ గానే చూపిస్తూ వస్తున్నారు. కానీ రష్మీ, సుధీర్ మాదిరిగానే వీరి మధ్య కూడా షో కోసం ఇచ్చే బిల్డప్ తప్ప ఏమీ లేదనే కామెంట్స్ కూడా వచ్చాయి.

రూమర్స్ డోస్ మరింత ఎక్కువయ్యాయి

రూమర్స్ డోస్ మరింత ఎక్కువయ్యాయి

అయితే రష్మీ, సుధీర్ వంటి వారు రూమర్స్ డోస్ ఎక్కువవుతున్న సమయంలో అప్పుడప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. తమ మధ్య ఏమి లేదని చెబుతూ వస్తున్నారు. కానీ దీప్తి సునయన-షణ్ముఖ్ మాత్రం కనీసం ఆ తరహాలో కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రూమర్స్ డోస్ మరింత ఎక్కువయ్యాయి.

Recommended Video

Actor Vivek మరణం: కంటతడి పెట్టిన Keerthy, త్రిష, సూర్య, ఈ తరం హాస్యనటుల్లో ఆ లక్షణాలు లేవు
మరో రెండేళ్ల తరువాత వారి పెళ్లి

మరో రెండేళ్ల తరువాత వారి పెళ్లి

ఇక ఫైనల్ గా సూర్య వెబ్ సిరీస్ యాక్టర్ సూర్య స్వామి వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఒక వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. అందులో తప్పేమీ ఉంది లవర్స్ కాకూడదు అనే రూల్ ఏమి లేదు కదా. ఎవరి ఇష్టం వారిది. ఏమో ఇద్దరి మధ్య ప్రేమ ఉండడం నిజమేనెమో అంటూ చెప్పి చెప్పకుండా వివరణ ఇచ్చారు. అంతే కాకుండా మరో రెండేళ్ల తరువాత వారి పెళ్లి కూడా చేసుకోవచ్చేమో అంటూ హింట్ ఇచ్చేశారు. దీంతో ఈ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X