ఆమె విషయం వితికకు తెలుసు: శద్రా దాస్‌తో ఎఫైర్‌పై వరుణ్ కామెంట్.. సోషల్ మీడియాలో వైరల్

బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రొమాన్స్, లవ్, ఏడుపులు సహా పలు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఈ షోలో వరుణ్ సందేశ్ ఆటపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో అందరూ ఆయన గురించి చర్చించుకుంటున్నారు.

భార్యతో కలిసి ఎంట్రీ

భార్యతో కలిసి ఎంట్రీ

కొద్దిరోజుల క్రితం లాంచనంగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ - 3కి ప్రముఖ హీరో వరుణ్ సందేశ్, తన భార్య వితిక షేరుతో కలిసి ఎంటరైన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ హౌస్‌లో రొమాన్స్ చేస్తూ తరచూ చర్చనీయాంశం అవుతున్నారు. అలాగే, అప్పుడప్పుడూ గొడవలు పెట్టుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. దీంతో ఈ జంట తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

గేమ్ కోసం భార్యతోనే గొడవ

గేమ్ కోసం భార్యతోనే గొడవ

బిగ్ బాస్ హౌస్‌లో వరుణ్ ఎంతో నిజాయితీగా ఆడుతున్నాడు. మొదట్లో భార్యను వెనకేసుకుని వచ్చిన అతడు క్రమంగా మారిపోయాడు. ఈ క్రమంలోనే వితికతో కూడా గొడవలు పెట్టుకుంటున్నాడు. గేమ్‌లో భాగంగా ఆమెతో గొడవ పడినప్పటికీ, భర్తగా కూల్ చేస్తూ నెట్టుకొస్తున్నాడు.

శ్రద్దా దాస్ ఎంట్రీ ఇస్తుందనడంతో

శ్రద్దా దాస్ ఎంట్రీ ఇస్తుందనడంతో

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే వారి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. శ్రద్దా దాస్, ఇషా రెబ్బా, హెబ్బా పటేల్, యాంకర్ మంజూష సహా ఎంతో మంది పేర్లు వినిపించిన విషయం తెలిసిందే. వారిలో అందరి కంటే ఎక్కువగా శ్రద్దా దాస్‌ పైనే వచ్చాయి. ఆమె ఈ వారం ఇంట్లోకి వెళ్తుందని కొందరు అంటే.. కాదు కాదు వచ్చే వారం వెళ్తుంది అని మరికొందరు రాశారు. దీంతో శ్రద్దా దాస్ పేరు హాట్ టాపిక్ అయిపోయింది.

వరుణ్ సందేశ్ లవర్ అంటూ వార్తలు

వరుణ్ సందేశ్ లవర్ అంటూ వార్తలు

శ్రద్దా దాస్ - వరుణ్ సందేశ్ మధ్య ఎఫైర్ నడిచినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010 ఏడాదిలో వచ్చిన ‘మరో చరిత్ర' అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వరుణ్ - శ్రద్దాల మధ్య ప్రేమ పుట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ జంట ఒకానొక సందర్భంలో కలిసి తిరుగుతూ మీడియా కంట పడింది. ఇవి ఆ సమయంలో ఎంతో హైలైట్ అయ్యాయి కూడా. ఈ పుకార్ల తర్వాత వరుణ్ సందేశ్ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

ఈ వార్తలపై వరుణ్ ఏమన్నాడంటే

ఈ వార్తలపై వరుణ్ ఏమన్నాడంటే

కొద్ది నెలల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో వరుణ్ తన లవ్ ఎఫైర్‌పై స్పందించాడు. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. కొద్దిరోజుల్లో పెళ్లి కాబోతుంది ఇలాంటివి ఇప్పుడు మాట్లాడుకోకూడదు. శ్రద్దా దాస్‌కు నాకు మధ్య ఏమీ జరగలేదు. ఇన్‌బుల్డ్‌గా కూడా ఏమీ లేదు. ఈ విషయాలన్నీ నాకు కాబోయే భార్య వితికకు కూడా తెలుసు. నన్ను అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా అదృష్టం' అని అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

శ్రద్దా మాత్రం వేరేలా చెప్పింది

శ్రద్దా మాత్రం వేరేలా చెప్పింది

ఇదే విషయంపై శ్రద్దా కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే, శ్రద్దా మాత్రం వరుణ్ సందేశ్ చెప్పిన దానికి భిన్నంగా స్పందించడం విశేషం. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వరుణ్ నేను ప్రేమించుకున్న విషయం నిజమే. కానీ, అది ముగిసిన అద్యాయం' అని ఆమె వెల్లడించింది. ఇక, తాజాగా బిగ్ బాస్ ఎంట్రీపై మాట్లాడిన ఆమె మీడియాపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X