బిగ్‌బాస్‌లోకి వరుణ్ సందేశ్.. ఇంట్లోకి ఆమెతో కలిసి.. నాగ్‌కు తప్పని పోటు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ ప్రారంభానికి ముందే రకరకాల వార్తలతో హీటెక్కిస్తున్నది. త్వరలోనే నాగార్జున హోస్ట్‌గా ఈ కార్యక్రమం మొదలు కానున్నది. ఈ నేపథ్యంలో ఈ రియాలిటీ షోలో పాల్గొనబోయేది వీరేనంటూ జాబితాలు వెబ్‌సైట్లో పుట్టుగొడుగుల్లా వెలుస్తున్నాయి. తాజాగా తెలుగు బిగ్‌బాస్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అదేమిటంటే.. ఫ్లాప్‌లతో టాలీవుడ్‌కు దూరమైన వరుణ్ సందేశ్ ఈ షోలోకు వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఆయనతోపాటు ఒకరిని లోనికి తీసుకెళ్తున్నట్టు ఊహాగానాలు చేలరేగుతున్నాయి. వివరాల్లోకి వెళితే

నాగ్‌కు ట్రోలింగ్ పోటు
బిగ్‌బాస్ సీజన్ 3కి ముందే హోస్ట్‌గా నాగార్జునపై ట్రోలింగ్ మొదలైంది. రెండో సీజన్ సందర్భంగా దేవదాస్ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా ఈ రియాలిటీ షోపై ఘాటైన కామెంట్లు విసిరారు. నాకు బిగ్‌బాస్ షో అసలే నచ్చదు. దానికి గురించి ఎత్తితే నాకు బూతులు వస్తాయి. అదేం షో అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. తాజాగా అదే షోకు హోస్ట్‌గా రావడంపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్‌తో చీల్చి చెండాడుతున్నారు.

వార్తల్లోకి వరుణ్ సందేశ్
ఇక బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు వరుణ్ సందేశ్ వార్తల్లో నిలిచాడు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడమే కాకుండా భార్యను కూడా తోడుగా తీసుకెళ్తున్నారనేది వార్త సారాంశం. అయితే ఇప్పటి వరకు తెలుగులో ఇది జరుగలేదు. కానీ ఇలాంటి వార్తకు అవకాశం ఉందా అనే విషయంపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. .

భార్యతోపాటు వరుణ్ సందేశ్
అత్యంత వివాదాస్పదమైన షోలోకి వరుణ్ సందేశ్ భార్య వితిక వెళ్తున్నారని, భార్యభర్తలు ఇద్దరు కలిసి హంగామా చేస్తారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. భార్యభర్తలు వెళితే గందరగోళం అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. హిందీలో ప్రేమికులు వెళితేనే నానా రచ్చ జరిగింది. జస్లీన్ మాతుర్, అనూప్ జలోటా జంట ఎంత వివాదం సృష్టించిందో తెలిసిన సంగతి తెలిసిందే. అయితే వరుణ్ సందేశ్ విషయంలో ఇది నిజం అవుతుందా అనే చూడాల్సిందే.

100 రోజులు పండుగ
ఇప్పటికే నాగార్జున హోస్ట్‌గా ప్రోమో మీడియాలో హల్ చల్ చేస్తున్నది. 100 రోజులపాటు ఈ షో ఉంటుందని, తానే దీనికి హోస్ట్ అని చెప్పకనే చెప్పాడు. ఈ షోలో ఉదయభాను, హేమచంద్ర, హర్ష, శ్రీముఖి లాంటి సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సెలబ్రిటీల జాబితాను గుట్టుగా ఉంచుతారనే విషయం తెలిసిందే. వేదిక మీద చూస్తేనే గానీ ఎవరు వెళ్తున్నారో చెప్పడం కష్టమే.


Click it and Unblock the Notifications











