ఆ తప్పుతో నా జీవితం అయిపోయింది.. ఇక చనిపోతాననుకున్నా.. టీవీ నటుడి ఆవేదన

Gundeninda Gudigantalu Balu:'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ లో బాలు అదేనండి బాల సుబ్రహ్మణ్యం (Balu) తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇతని అసలు పేరు విష్ణుకాంత్ (Vishnukanth). బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. సీరియల్ విజయంతో పాటు 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో కూడా తన ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖితో కనిపించిన లవ్ ట్రాక్ వల్ల అతని పాపులారిటీ మరింత పెరిగి, బుల్లితెర ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా ఓ తప్పుతో నా జీవితం అయిపోయింది, ఇక చనిపోతాననుకున్నా..అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏమైంది? అందుకు అంత ఎమోషన్ అయ్యారు?

విష్ణుకాంత్ తమిళ నటుడు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించిన ఆయన తర్వాత సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించాడు. 'సిప్పికల్ ముత్తు' సీరియల్‌లో నటిస్తున్న సమయంలో సహనటి సంయుక్తతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వారి పెళ్లి జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లైన కేవలం 15 రోజుల్లోనే ఇద్దరూ విడిపోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, ఫోటోలు డిలీట్ చేయడంతో వార్తలు మరింత వైరల్ అయ్యాయి.

Actor Vishnukanth aka Gundeninda Gudigantalu Balu Emotional speech in Star Maa Parivaar Awards 2026

వీరి విడాకులపై అప్పట్లో పలు రూమర్స్ వినిపించాయి. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత విభేదాలు కారణమని ప్రచారం జరిగింది. అయితే తర్వాత విష్ణుకాంత్ స్వయంగా స్పందిస్తూ, సంయుక్త కుటుంబం వల్లే సమస్యలు వచ్చాయని తెలిపాడు. ఇద్దరి మధ్య అపార్థాలు పెరగడంతో చివరకు విడిపోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ ఘటన తర్వాత తమిళంలో అవకాశాలు తగ్గడంతో, విష్ణుకాంత్ తెలుగు సీరియల్స్ వైపు అడుగుపెట్టాడు. 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ ద్వారా 'బాలు'గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో శ్రీముఖితో కనిపించిన ట్రాక్ వల్ల మరింత పాపులారిటీ సంపాదించాడు.

ఇదిలాఉంటే.. స్టార్ మా పరివారం అవార్డ్స్ 2026 వేడుకలో భాగంగా 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన విష్ణుకాంత్ అలియాస్ బాలు అందుకున్న 'పాపులర్ హస్బెండ్' అవార్డు ఈ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. స్టేజ్‌పై అవార్డు స్వీకరించిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ప్రేక్షకులను కదిలించాయి.

అవార్డు అందుకునే ముందు విష్ణుకాంత్ జీవితానికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ప్లే చేశారు. అందులో తన జీవిత ప్రయాణాన్ని ఆయన స్వయంగా వివరించాడు. "ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగాను... ఇక్కడినుంచే మీ ముందుకు వచ్చాను" అంటూ తన కుటుంబ నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. మొదట తాను ఐటీ ఉద్యోగం చేస్తున్నానని, కానీ ఆ ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత చాలా కాలం బాధపడ్డానని తెలిపారు. 'ఆ నిర్ణయం తప్పా?' అని అనుమానాలు వచ్చాయని, కానీ ఆ తర్వాత నటనపై పూర్తిగా ఫోకస్ పెట్టడంతో తన జీవితమే మారిపోయిందని చెప్పారు. 'నాకు కొత్త జీవితం ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ... తెలుగు ప్రేక్షకులే' అంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇక స్టేజ్‌పై అవార్డు అందుకున్న తర్వాత చేసిన స్పీచ్ మరింత హార్ట్ టచ్చింగ్ మారింది. '2023లో నా జీవితం ముగిసిపోయిందనుకున్నాను.. విష్ణు అనే వ్యక్తి ఇక లేడనుకున్నాను. నేను బ్రతకలేనని కూడా అనిపించింది' అంటూ తన జీవితంలో ఎదురైన కఠిన దశను గుర్తు చేసుకున్నారు. అయితే అదే సంవత్సరం 'బాలు' అనే పాత్రతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం తనకు పునర్జన్మ లాంటిదని చెప్పారు. 'నా అమ్మానాన్నల తర్వాత నన్ను ఇంత ప్రేమగా చూసుకున్న వారు తెలుగు ప్రేక్షకులే' అంటూ ఆయన చెప్పిన మాటలు స్టేజ్‌పై ఉన్న వారిని భావోద్వేగానికి గురి చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X