తారలు మారినా, సాగుతున్న మొగలిరేకులు

By Pratap

Mogali Rekulu
హైదరాబాద్: మొగలిరేకులు సీరియల్‌లో ఇటీవల రెండు ప్రధాన పాత్రలకు తారలు మారారు. సీరియల్‌లో హీరోయిన్ స్థాయి పాత్ర దేవి. ఈ పాత్రలో నటించే తార మారిపోయింది. గత రెండు రోజులుగా మరో తారను దేవి పాత్రలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు మరో పాత్ర కూడా మారింది. సింధు పాత్రకు పాత తార మారిపోయి కొత్త తార వచ్చింది. ఈ సీరియల్ జెమినీ టీవీలో ప్రసారమవుతోంది. శని, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి 9 గంటల వరకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది. ఈ సమయంలో ఇంటిల్లిపాది, ముఖ్యంగా మహిళలు టీవీకి అతుక్కుపోతున్నారు.

మంజులానాయుడు ఈ సీరియల్‌కు కథ రాశారు. 860కి పైగా ఎపిసోడ్స్ ఇప్పటి వరకు ప్రసారమయ్యాయి. ముళ్లు, పాముల మధ్య వికసించే పూల గురించి ఈ సీరియల్ మాట్లాడుతుందని భాష్యం చెబుతారు. అయోమయం, గందరగోళం బతుకులు బతికే వ్యక్తుల మధ్య ప్రేమ వికసించే తీరును ఈ సీరియల్ చిత్రీకరించింది. తమ తమ జీవితాల్లో వేర్వేరు సందర్భాల్లో దెబ్బలు తిన్న ఐదుగురు అనాథల కథ ఇది.

వారి జీవితాల్లో నుదుటి రాత అనేక మలుపులకు కారణమవుతుంది. తమ తమ అనుభవాలను వారు పంచుకుంటుంటారు. ఉత్కంఠభరితమైన దృశ్యాలతో ఈ సీరియల్ సాగుతోంది. ఈ రోజు సీరియల్ ముగిసే సరికి రేపు ఏమవుతుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తూ నెలల తరబడి ఈ సీరియల్ అవిచ్ఛిన్నంగా సాగుతోంది.

ఆర్‌కె నాయుడు పాత్ర ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. చిన్నతంలో తప్పిపోయిన అతని కుమారుడి పాత్రను కూడా ఒకే నటుడు పోషించాడు. అలాగే సెల్వమణి పాత్ర, సెల్వమణి తల్లి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చెడ్డవాళ్లు మంచివాళ్లుగా మారుతున్న దశకు ప్రస్తుతం ఈ సీరియల్ చేరుకుంది. వివిధ పరిస్థితుల వల్ల, కారణాల వల్ల తప్పుడు పనులు చేసేవారిని ప్రేమ మంచి మనుషులుగా మార్చేస్తుంటుంది. ఆరె నాయుడు పాత్ర ఆ మార్పునకు కేంద్ర బిందువుగా పనిచేస్తూ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X