భర్తకు గుడ్‌బై చెప్పిన యువ తార.. విడాకులు బాధాకరమని యాక్టర్ ఆవేదన
సినీ పరిశ్రమలో మరో జంట విడాకులు తీసుకోవడం మీడియాలో హల్‌చల్ రేపింది. తాజాగా తప్పడ్ సినిమాలో నటించిన సిద్ధాంత్ కార్నిక్ దంపతులు అధికారికంగా విడాకుల పత్రాలు అందుకోవడంతో వారిద్దరి విడిపోవడం జరిగింది. గత కొద్దిరోజులుగా వేర్వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్న వీరిద్దరూ అధికారికంగా విడిపోయారని సన్నిహితులు, మీడియాలో వెల్లడైంది.

మేఘా గుప్తా, సిద్దాంత్ గురించి
టెలివిజన్ రంగంలోకి మేఘా గుప్తా కుసుమ్ సీరియల్ ద్వారా అడుగు పెట్టింది. ఆ తర్వాత కావ్యాంజలి, సీఐడీ, సావ్‌ధాన్ ఇండియా, డ్రీమ్ గర్ల్ లాంటి సీరియల్స్‌తో అలరించింది. షారుఖ్ ఖాన్ నటించిన ఫ్యాన్ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇక సిద్దాంత్ విషయానికి వస్తే ఫాస్ట్ ఫార్వర్డ్, యే మేరా ఇండియా, లఫంగే పరిందే, తప్పడ్ చిత్రాలతో గుర్తింపు పొందారు.

మూడేళ్ల వైవాహిక జీవితంలో
టెలివిజన్ రంగంలో రాణిస్తున్న కాలంలో జరిగిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత 2016లో వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఇటీవల వారిద్దరి విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా వారికి కోర్టు కొద్ది రోజుల క్రితం మంజూరు చేసింది.

వైవాహిక జీవితమంటే..
మేఘా గుప్తాతో విడాకుల గురించి సిద్ధాంత్ స్పందిస్తూ.. వైవాహిక జీవితమంటే అంత సులభమైంది కాదు. చాలా సహనంతో దానిని కొనసాగించాలి. ఏ బంధంలోనైనా ప్రశాంతత అనేది బలంగా మారుస్తుంది. అనూహ్యంగా విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైన పనే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పడం లేదు అని అన్నారు.
Recommended Video


గతేడాది మార్చి నుంచి
గతేడాది మార్చి నుంచి మేము వేర్వేరుగా జీవిస్తున్నాం. కొన్నాళ్లు దూరంగా ఉండి జీవిద్దాం అనుకున్నాం. ఒకవేళ దూరం మమల్ని దగ్గర చేస్తే కలిసి జీవించాలనుకొన్నాం. కానీ మా విషయంలో ఇంకా దూరమే పెరిగింది. దాంతో విడిపోవాలని అనుకొన్నాం. మా ఇద్దరి జీవితాల్లో ప్రశాంతత ఉండాలంటే విడాకులు తప్పని సరి అనే నిర్ణయానికి వచ్చాం అని సిద్ధాంత్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











