Anasuya Bharadwaj జబర్దస్త్ మానేయడానికి కారణం అదే... అనసూయ షాకింగ్ కామెంట్స్

నటి, యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయింది. ఇక ఆ షోకు గుడ్ బై చెప్పి... వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఈ భామ ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో ఓ షాపింగ్ మాల్ లో సందడి చేసింది. అక్కడ వారితో కలిసి డ్యాన్సులు చేసింది. అయితే జబర్దస్త్ ఎందుకు మానేయాల్సి వచ్చిందో రివిల్ చేసింది అనసూయ. అసలు జబర్దస్త్ షో మానేయడానికి కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

అనసూయ భరద్వాజ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ... కనిపించేది. ఇక ఆతర్వాత ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్ లో యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరించింది. ఇక జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో అనసూయ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చింది. ఇక ఈ షోలో అందం, అభినయంతో చలాకీ మాటలతో ఆకట్టుకుంది. ఇక రష్మికి పోటీగా అనసూయ అందాలను ఆరబోస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. అయితే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసి... మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Actrees Anchor Anasuya Bharadwaj Reveals Why She is Away From Jabardasth

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాతో అనసూయ ఫేట్ మారిపోయింది. ఇక ఈ సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక ఆ సినిమా తర్వాత పుష్ప సినిమాతో మరింత ఫేమస్ అయింది. ఇక వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో జబర్ధస్త్ ప్రోగ్రామ్ కు గుడ్ బై చెప్పింది. వరుసగా సినిమాలు చేస్తూ... ప్రేక్షకులను ఎంటర్ టైన్మెంట్ చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అనసూయ.. .ఎప్పటికప్పడూ తన అందాలతో అలరిస్తూనే వస్తుంది. ఇక వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ భామ ప్రేమ విమానం అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభుదేవ వుల్ఫ్, సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాల్లో నటిస్తుంది. ఇక ప్రేమ విమానం ఓటీటీలో రిలీజ్ కానుంది.

Anchor Anasuya Bharadwaj Stills

అయితే తాజాగా ఈ భామ నంద్యాలలో సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంది. షాపింగ్ మాల్ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై అనసూయ డ్యాన్స్‌ చేసి అభిమానులను అలరించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు.. అమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. జబర్దస్త్‌కు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో చెప్పుకువచ్చింది.

Anasuya Bharadwaj Dress

ఇక జబర్దస్త్ మానేయడానికి అసలు కారణం... ప్రేక్షకులు తనను యాంకర్ గా చూస్తున్నారని... నటిగా చూడటం లేదని తెలిపింది. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో నవ్వుతూ ఉంటాను.. నవ్విస్తూ ఉంటాను... సినిమాల విషయానికి వచ్చేసరికి సీరియస్ క్యారెక్టర్స్ చేస్తుంటాను. అట్లా ప్రేక్షకులు కన్ఫూజ్ అవుతున్నారు. అందుకే జబర్దస్త్ మానేశాను అంటూ చెప్పుకు వచ్చింది. ఇక తనకు లైఫ్ ఇచ్చింది మాత్రం జబర్దస్త్ అంటు వెల్లడించింది. ప్రస్తుతం ఈమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X