‘నైట్ ఆ లోకేషన్‌కి వస్తావా.. నల్లగా ఉన్నాననే సాకుతో ఆ డైరెక్టర్‌ దారుణంగా’

చిత్ర పరిశ్రమలో అవకాశాల పేరుతో కొత్తగా వచ్చే అమ్మాయిల్ని ట్రాప్ చేసి వారితో లైంగిక వాంఛలు తీర్చుకునే కామాంధుల గురించి నిత్యం ఎక్కడో ఒక చోట వార్తలు వస్తూనే ఉన్నాయి. చాలామంది హీరోయిన్లు, మహిళా నటులు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను, పైకి పెద్ద మనుషుల్లా చెలామణి అయ్యే వారి నిజస్వరూపాలను బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో క్యాస్టింగ్ కౌచ్ గురించి, సినీ పరిశ్రమలో వేధింపుల గురించి ప్రదర్శించిన స్కిట్ అందరినీ కంటతడి పెట్టించింది. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన సీనియర్ హీరోయిన్ ఆమని తన జీవితంలో జరిగిన వేధింపుల గురించి చెబుతూ ఒక్కసారిగా కంటతడి పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు తెలుగుతోపాటు దక్షిణాది ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్లలో ఆమని ఒకరు. గ్లామర్ రోల్స్‌కు దూరంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌందర్య, రోజా, రమ్యకృష్ణ, మీనా వంటి స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీని దున్నేస్తున్న దశలో ఎంట్రీ తనమార్క్ చూపించారు ఆమని. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌గా ఆమని నిలిచారు. ముఖ్యంగా మావిచిగురు, శుభలగ్నం వంటి సినిమాలలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

Actress Aamani Gets Emotional on Sridevi Drama Company Shares Shocking Casting Couch Experience

జంబలకిడి పంబ, మిస్టర్ పెళ్లాం, కన్నయ్య కిట్టయ్య, అమ్మ దొంగ, ఘరానా బుల్లోడు, సిసింద్రీ, శుభ సంకల్పం, వంశానికొక్కడు, మావిచిగురు, శుభలగ్నం తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమని. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న దశలో తమిళ నిర్మాత ఖాజా మోహియుద్దీన్‌ని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు. మనస్పర్థల కారణంగా ఆమని కొన్నాళ్లకే తన భర్తతో విడిపోయారు.

ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమని.. ప్రస్తుతం తల్లి, వదిన వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. స్వామి, ఆ నలుగురు, చందమామ కథలు, భరత్ అనే నేను తదితర సినిమాలలో నటించారు. సినిమాలే కాకుండా బుల్లితెరపై సీరియల్స్, ప్రత్యేక కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు ఆమని. అలాగే వరుస ఇంటర్వ్యూలతో ఇండస్ట్రీలోని పరిణామాలను, చీకటి కోణాలను బయటపెడుతున్నారు. ప్రత్యేకించి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమని చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరయ్యారు ఆమని. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది.

తెలుగు బుల్లితెర, వెండితెరలకు చెందిన నటీనటులను సీనియర్స్, జూనియర్స్‌గా విభజించి ఫన్ క్రియేట్ చేసింది యాంకర్ రష్మి గౌతమ్. సీనియర్లు కూడా తగ్గేదే లేదంటూ రెచ్చిపోయారు. డ్యాన్స్‌, కబడ్డీ పోటీలలో సీనియర్ భామలు దుమ్మురేపారు. ఇక సీరియల్ షూటింగ్ సమయంలో నటీనటులతో దర్శకులు ఎలా చేయిస్తారో సుహాసినీ, పొట్టి నరేష్‌లు ఫన్నీగా చేసి చూపించి అందరినీ నవ్వించారు. ఆ తర్వాత సినీరంగంలో ఆడిషన్స్, క్యాస్టింగ్ కౌచ్, అమ్మాయిలకు జరిగే అవమానాలు, వేధింపుల గురించి తెలుపుతూ చేసిన స్కిట్ అందరినీ కంటతడి పెట్టించింది.

హీరోయిన్‌కి ఆడిషన్ ఇవ్వడానికి వచ్చావా? కానీ నువ్వు నల్లగా ఉన్నావమ్మా? హీరోయిన్‌గా పనికిరావు, సైడ్ క్యారెక్టర్ ఉంది చేస్తావా అని డైరెక్టర్‌గా ఉన్న అబ్బాయి అంటాడు. దానికి ఆమె అంగీకరించి షూటింగ్ చేస్తూండగా.. షాట్ మధ్యలో నువ్వు హీరోయిన్‌ని డామినేట్ చేస్తున్నావు, ఆ అమ్మాయిని పక్కకి వచ్చేయమని చెప్పండి అంటాడు. ఆ తర్వాత డైరెక్టర్ వచ్చి నీకు ఒక లోకేషన్ పంపిస్తాను, నైట్ అక్కడికి ఒంటరిగా వచ్చేయమని ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అది చూస్తూ అందరూ ఎమోషనల్ అవుతారు. మరీ ముఖ్యంగా ఆమని కంటతడి పెట్టారు. ఈ కథ సరిగ్గా నాకు జరిగినట్లుగానే ఉంది. నువ్వు నల్లగా ఉన్నావు? నీ పర్సనాలిటీ ఇలా ఉంది.. లోకేషన్ దగ్గరకి వస్తావా అని తనను వేధించినట్లు ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమెకు ఏం జరిగింది? ఆమనితో ఎవరు మిస్ బిహేవ్ చేశారో పూర్తి వివరాలు తెలియాలంటే జూన్ 7న ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more about: sridevi drama company
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X