Bigg Boss Telugu 6: నాగార్జున సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ.. బిగ్‌బాస్‌తో మళ్లీ రీ ఎంట్రీ
బుల్లితెరపా బిగ్‌బాస్ నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది. అన్ని భాషల్లో హిట్ అయిన ఈ షో తెలుగులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా ఆరో సీజన్‌తో ముందుకు వచ్చింది. ఈ సీజన్‌ను కూడా టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నాడు. అయితే నాగార్జున సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ అభినయ శ్రీ.. చాలా కాలం తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రానుంది. మరి ఆమె వివరాలేంటో చూసేద్దామా!

ఐటమ్ సాంగ్‌తో..
అభినయశ్రీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2004లో అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ ఆర్యలో అ.. అంటే అమలాపురం అనే పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ పాట ఎంత పాపులరో.. అందులో నర్తించిన అభినయశ్రీ అంతకుమించి ఫేమస్ అయింది. ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది అభినయ శ్రీ.

విజయ్, సూర్యతో కలిసి..
అభినయ శ్రీ మొదటగా తమిళ చిత్రంలో నటించింది. 2001లో వచ్చిన తమిళ కామెడీ చిత్రం ఫ్రెండ్స్ మూవీలో సిద్ధికీ అనే పాత్రతో గుర్తింపు పొందింది. ఇందులో ఆమె విజయ్, సూర్యతో కలిసి నటించింది. ఆ తర్వాత నాగార్జున, సుమంత్ కలిసి నటించిన చిత్రం స్నేహమంటే ఇదేరా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అభినయ శ్రీ. అనంతరం మూడేళ్లకు అంటే 2004లో ఆర్య సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించి పాపులారిటీ దక్కించుకుంది.

నంది అవార్డు..
2005లో తెలుగు కామెడీ సినిమా హంగామాలో ఒక హీరోయిన్గా చేసింది అభినయ శ్రీ. ఈ మూవీలో వేణు మాధవ్, అలీ హీరోలుగా చేసిన విషయం తెలిసిందే. అయితే పైసాలో పరమాత్మ అనే సినిమాలో పోషించిన పాత్రకు బెస్ట్ ఫీమేల్ కమెడియన్‌గా నంది అవార్డు అందుకుంది అభినయ శ్రీ.

పూర్తి సపోర్టింగ్ రోల్లో..
అప్పటివరకు ఐటమ్ సాంగ్స్ చేస్తూ అలరించిన అభినయ శ్రీ.. 2007లో వచ్చిన ఆదివారం ఆడవాళ్లకు సెలవు సినిమాతో పూర్తి స్థాయి సపోర్టింగ్ రోల్లో కనిపించింది. ఆతర్వాత ఐటమ్ సాంగ్స్‌లో నర్తించలేదు అభినయ శ్రీ. ఇక చాలా కాలం తర్వాత మళ్లీ బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అభినయశ్రీ. కాగా అభినయ శ్రీ తల్లి అనురాధ కూడా అలనాటి తెలుగు నటిగా గుర్తింపు పొందింది.

ఆసక్తికరంగా..
ఇదిలా ఉంటే తాజగా టెలివిజన్‌లో రానున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌ను మళ్లీ నాగార్జున అక్కినేని హోస్ట్ చేయనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ నాలుగు నుంచి ప్రారంభమైన ఈ షోలో టాస్క్‌లు, పనిష్మెంట్లు ఆసక్తికరంగా ఉండనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











