అటు ‘పడమటి గాలి’ సీరియల్ లో ఇటు శివాజి సినిమాలో

By Srikanya

Padamati Gali
ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా వెండి తెరకు పరిచమైన ముద్దుగుమ్మ అదితి అగర్వాల్. అల్లు అర్జున్ సరసన గంగోత్రి చిత్రంతో చేసిన ఆమె ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా ఏదీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో ఆమె తన అడుగులను టీవి సీరియల్స్ వైపు వేయటం మొదలెట్టింది. తాజాగా ఆమె 'పడమటి గాలి'అనే టీవీ సీరియల్ లో ప్రధాన పాత్రను చేస్తోంది. ఎన్నో మెగా సీరియల్స్‌లో నటించిన రిషి ఈ సీరియల్ హీరో.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...'సినిమా నుంచి సీరియల్ వైపు రావడం యాదృచ్ఛికం. అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. అందుకే వాటిలో నటిస్తున్నా. సినిమాలు సినిమాలే. సీరియళ్లు సీరియళ్లే' అంది అదితి అగర్వాల్. 'వైష్ణవి'గా ఈ సీరియల్‌లో ప్రధాన భూమికను పోషించిన అదితి. త్వరలోనే శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలలో 40 రోజుల చిత్రీకరణకు గాను ఈయూనిట్ వెళ్లబోతోంది.

ఇండియా నుంచి అమెరికా వెళ్లే ప్రతి అమ్మాయి సమస్యను ఆవిష్కరిస్తుందీ సీరియల్. తెలుగు లోగిళ్ల నుంచి అమెరికా వెళ్లే ఏ అమ్మాయి అయినా సమస్యలను ఎదిరించి పోరాడాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే నంటోంది. షీర్ మీడియా ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై ఎన్.జె.హెన్రీ ఈ సీరియల్‌ని నిర్మిస్తున్నారు. 'శుభలేఖ' సుధాకర్, 'మయూరి' సుధాచంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్‌లో మలయాళ హీరో ప్రజిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఈ సీరియల్‌ని ఎక్కువ శాతం విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరించారు.

ప్రస్తుతం అదితి అగర్వాల్ ..శివాజి సరసన నటించింది. గాంధీ మనోహర్ డైరక్ట్ చేసిన ఆ చిత్రం టైటిల్ ఏం బాబూ లడ్డూ కావాలా. షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం ప్రస్తుతం ఆడియో లాంచింగ్ కి ముస్తాబు అవుతోంది. వచ్చే నెలలో చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం క్లిక్ అయితే ఈ సీరియల్ కి కూడా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

టెలీకాస్ట్ సమయం: జెమినీ టీవిలో 'పడమటి గాలి' సీరియల్ రాత్రి ఎనిమిది గంటలుకు ప్రసారం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X