Anasuya Bharadwaj : ఆ జ్ఞాపకాలు దాచుకోలేకపోయా, అనసూయ ఎమోషనల్ పోస్ట్

సినీ రంగంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు, గొప్ప టెక్నీషియన్స్ ఇలా ఎన్నో విభాగాలు ఉన్నప్పటికీ ఓ సినిమా విషయంలో డైరెక్టర్‌ది కీ రోల్. 24 క్రాఫ్ట్స్ నుంచి తనకు కావాల్సిన ఔట్‌పుట్ రాబట్టి, ప్రేక్షకుడిని రెండున్నర గంటల పాటు కుర్చీలో కూర్చోబెడతాడు దర్శకుడు. అందుకే డైరెక్టర్‌ను కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా సినీరంగంలో అభివర్ణిస్తారు. దర్శకుడి కళాత్మకత , ఆయన ఎంత సమర్ధుడన్న దానిపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. ఈ రేసులో విజయం సాధించినవాళ్లు కొందరే. ఇలాంటి వారిలోనూ స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు కొందరే. ఈ కోవలోకే వస్తారు సుకుమార్ .

ఓ సాధారణ లెక్చరర్ స్థాయి నుంచి టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు సుకుమార్. రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా విభిన్నమైన కథలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా దక్కించుకున్నారు సుక్కు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ఆర్యతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే డిఫరెంట్ ప్రేమ కథను డీల్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ వెంటనే చాక్లెట్ బాయ్ రామ్ హీరోగా జగడం అనే సినిమాను తీశారు సుకుమార్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఆ వెంటనే మరోసారి అల్లు అర్జున్‌‌తో ఆర్య 2, నాగచైతన్యతో 100 % లవ్‌లు తీసి ట్రాక్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏకంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకుని ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశాడు. అదే వన్ నేనొక్కడినే. తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడూ రాని విధంగా డిఫరెంట్ టేకింగ్‌తో ఈ సినిమాను తీశాడు సుకుమార్. ఇది కూడా కమర్షియల్‌గా హిట్ కాలేకపోయినా .. సుకుమార్ డైరెక్షన్‌కి, మహేశ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ రావడం విశేషం .

తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాలు తీసి టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టించాడు. ఇక అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన పుష్ప సిరీస్‌తో దేశాన్ని ఒక ఊపారు. పుష్ప 2 భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచి రూ.2000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. దర్శకుడిగానే కాదు నిర్మాతగానూ సుకుమార్ సక్సెస్ అయ్యారు. సుకుమార్ రైటింగ్స్ పేరిట బ్యానర్ స్థాపించి తన శిష్యులను డైరెక్టర్లుగా మార్చి జీవితంలో నిలదొక్కుకునేలా చేస్తున్నారు

actress anasuya Bharadwaj birth day wishes to pushpa 2 director Sukumar

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే సుకుమార్‌ను చిత్ర పరిశ్రమలో అంతా ఇష్టపడతారు. మీడియాకు, పబ్లిసిటీకి దూరంగా ఉండే సుకుమార్ వివాదాలకు, కాంట్రవర్సీల జోలికి వెళ్లారు. ఇవాళ ఈ క్రియేటివ్ జీనియస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు . ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా సుకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

నాకు జీవితాన్ని ఇచ్చింది మీరే సుక్కూ సార్.. అయితే మీ దృష్టిలో నేను ఎప్పుడూ ఉంటాననే భావనతో ఎక్కువ ఫోటోలు దిగలేకపోయాను. మీతో పనిచేయడం నా అదృష్టం.. నా కళను నమ్మి అవకాశం ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. దర్శకుడిగానే కాకుండా మీ గురించి బాగా తెలిసిన ఒకరిగా గర్వంగా ఫీల్ అవుతుంటా, మీరెప్పుడూ నాకు ఇన్స్‌పిరేషన్‌గా ఉంటారు అంటై సుకుమార్‌కు అనసూయ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X