మొరిగే కుక్కలు.. అనసూయ మరో వివాదాస్పద ట్వీట్.. మళ్లీ భగ్గుమన్న ఫ్యాన్స్

లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన యాంకర్, యాక్టర్ అనసూయ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నారు. అయితే ఆమె అభిప్రాయాలు, పోస్టుల మాత్రం వివాదాస్పదంగా మారుతున్నాయి. అనసూయ చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తున్న స్టేట్‌మెంట్లపై పలు రకాల హీరోల ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. రోజు వారీ దినచర్యలో భాగంగా అనసూయ పెట్టిన పోస్టు ఆసక్తికరమైన చర్చకు దారి తీయడమే కాకుండా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఇంతకు అనసూయ పెట్టిన పోస్టు ఏమిటంటే..

Recommended Video

Chiru 152 | Anchor Anasuya To Surprise Fans In Mega Film | Acharya
బుద్దిరాదు అంటూ..

బుద్దిరాదు అంటూ..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల ఫేక్ న్యూస్‌పై వీడియోను రిలీజ్ చేయడం, చాలా మంది సినీ ప్రముఖుల మద్దతు తెలియజేయడం తెలిసిందే. అలాంటి ఎమోషనల్ సమయంలో తన వరకు వస్తే గానీ బుద్ది రాదు అంటూ అనసూయ చేసిన పోస్టు వైరల్ అయింది. ఎవరిని టార్గెట్ చేసుకొని ఈ పోస్టు పెట్టింది అనే విషయం చర్చనీయాంశమైంది. అయితే విజయ్ దేవరకొండనే టార్గెట్ చేసిందంటూ ఫ్యాన్స్ భగ్గుమాన్నారు.

ద్వేషించడం ఆపండి..

ద్వేషించడం ఆపండి..

ఇలాంటి సమయంలో అనసూయ స్పందిస్తూ.. రకరకాల అపోహాలకు, మ్యానిపులేషన్స్‌ జరుగుతున్నాయి. ఇంకా దుర్వినియోగం చేయడం, ద్వేషించడం ఆగడం లేదు. ఇంకా ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం, ఒకరిని మరొకరు ఏమార్చుకోవడం జరుగుతున్నాయి. మనమంతా ట్రాక్ తప్పుతున్నామా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి విషయాల నుంచి బయటపడి ఏదైనా మంచిని అనుసరించగలమా? నేర్చుకోగలమా అంటూ అనసూయ ట్వీట్ చేశారు.

నెగిటివిటీ ఆపండి

నెగిటివిటీ ఆపండి


ఇంకా అంతటితో అనసూయ ఆగకుండా మరో ట్వీట్‌‌లో అన్ని చోట్ల ఒకరికి మరొకరికి మధ్య నెగిటివిటే. రకరకాల గ్రూపుల మధ్య వివాదాలు చూస్తే సిగ్గు పడాల్సి వస్తున్నది. చాలా విషయాలను గుర్తించి కూడా మనం ఏమీ నేర్చుకోవడం లేదు. అందులో నా తప్పుకూడా ఉంది. మనం ఏం కోల్పోతున్నామో అనే విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడు రియలైజ్ అవుతామో అంటూ అనసూయ తన ట్వీట్‌లో పేర్కొన్నది.

కులం, మతాలకు అతీతంగా

కులం, మతాలకు అతీతంగా

ఇలా ఆవేదన, ఆక్రోషాన్ని అనసూయ బయటపెడుతూనే అనసూయ మనసులో ఏది అనిపిస్తే.. దానిని ట్విట్టర్‌లోకి పెట్టేస్తున్నది. క్వారంటైన్ ఒత్తిడికి గురవుతున్నారో అనే అనుమానం మనక కలుగక మానదు. అదే క్రమంలో మరో ట్వీట్‌లో కంటికి కనిపించని విషయాలు ప్రపంచంలో చాలానే జరుగుతున్నాయి. మనల్ని ఒకర్ని మరొకరం రక్షించుకోవడమనే విషయంపై ఎలా రియలైజ్ అవుతామో ఏమో. భాష, కులం, వర్ణం, సరిహద్దులు, జాతి అనే తేడా లేకుండా అందరం ఎప్పుడు ఏకం అవుతామో. ఇకనైనా విద్వేషాన్ని వీడి.. ఒకరిపై మరొకరు బురద జల్లుకోవడం ఆపుదామా? అంటూ అనసూయ ట్వీట్ చేసింది.

మొరిగే కుక్కలపై రాళ్లు

మొరిగే కుక్కలపై రాళ్లు

ఇలా సంయమనం, సదుద్దేశంతో అనసూయ ఉంటూనే మరోసారి ట్విట్టర్‌లో అనసూయ వివాదాస్పదానికి తావు ఇచ్చే కొటేషన్ పోస్టు పెట్టారు. మొరిగే కుక్కలపై రాళ్లు విసరడం ఆపకపోతే నీ లక్ష్యాన్ని నీవు ఎప్పటికీ చేరుకోలేవు అంటూ అనసూయ ఘాటుగా స్పందించింది. అయితే ఈ పరిస్థితుల్లో ఈ పోస్టు ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయం చర్చనీయాంశమైంది.

భగ్గుమన్న ఫ్యాన్స్

భగ్గుమన్న ఫ్యాన్స్

తాజా అనసూయ పెట్టిన కొటేషన్ పోస్టుపై నెటిజన్లు భగ్గుమన్నారు. ‘ముందు మీరు అలాంటివి ఆపండి'. ‘ఈ మాటలను మీకు అప్లై చేసుకోండి'. ‘అలా అంటూనే మీరు రోజుకో రాయి వేస్తున్నారు'. ‘ఇలా నీవు రాళ్లు వేయడం ఆపకుంటే నీ లక్ష్యాన్ని చేరుకోలేవు'. ‘కుక్కలంటే సాధారణంగా మొరుగుతూనే ఉంటాయి'. ‘మనమే వాటికి దూరంగా ఉంటే మంచిది'. ‘విజయ్ దేవరకొండ, ఇతర హీరోలపై నీవు రాళ్లు వేయడం ఆపండి' అంటూ పలువురు నెటిజన్లు అనసూయను ట్రోల్ చేయడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X