AP Election Results: నగరి ఓటమి ఎఫెక్ట్: జబర్దస్త్ జడ్జీగా రోజా రీఎంట్రీ.. అదే దిక్కు అంటూ దారుణంగా ట్రోలింగ్
జబర్దస్త్ కు రోజా రీఎంట్రీ ఇస్తుందా.. ? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ మొదలైనప్పటినుంచి ఆమె జడ్జిగా వ్యవహరిస్తూ వస్తుంది. నాగబాబు, రోజా నే మొదట జబర్దస్త్ జడ్జిలుగా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఐదేళ్లకు పైగా వీరిద్దరూ ఆ కామెడీ సామ్రాజ్యన్ని కింగ్ అండ్ క్వీన్ గా ఏలారు. ఇక అన్నిరోజులు ఒకేలా ఉండవు అన్నట్లు కొన్ని విబేధాల కారణంగా నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు.
ఎప్పుడైతే నాగబాబు షో నుంచి బయటకు వచ్చాడో .. కొద్దికొద్దిగా జబర్దస్త్ రూపురేఖలు మారుతూ వచ్చాయి. ఇక ఎలాగోలా రోజా జబర్దస్త్ బరువును భుజాన వేసుకొని తిరిగింది. అయితే గత ఎన్నికల్లో ఆమె మంత్రిగా మారాక పూర్తిగా జబర్దస్త్ కు రోజా బ్రేక్ ఇచ్చింది. అలావెళ్లిన రోజమ్మ మళ్లీ జబర్దస్త్ కు రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యింది అని టాక్ నడుస్తోంది. నేడు ఏపీఎన్నికలు ఫలితాల్లో రోజా ఓడిపోయింది. నగరిలో ఆమె డిపాజిట్లు కూడా కోల్పోయింది.

తన పరాజయం ముందే తెలిసి ఆమె మల్లెమాలతో ముందే మాట్లాడుకొని అందుతుంది. ఈ మధ్య జబర్దస్త్ లో చాలా మార్పులు జరిగాయి. జబర్దస్త్.. ఎక్స్ట్రా జబర్దస్త్ ను కలిపి మళ్లీ ఒకటే జబర్దస్త్ గామార్చారు. టీమ్స్ నుతగ్గించారు .ముఖ్యంగా ఇంద్రజ ముందే తన జడ్జి పదవి నుంచి తప్పుకుంది. గత వారం ఇంద్రజ జబర్దస్త్ ను వదిలి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. దానికి కారణం రోజానే. ఆమె మళ్లీ తిరిగి వస్తుంది అని తెలియడంతో మర్యాదపూర్వకంగా ఇంద్రజ ముందే వెళ్లిపోయినట్లు సమాచారం.
గతంలో ఇంద్రజ ఇదే మాటను చెప్పుకొచ్చింది. ఈ స్థానం రోజాది.. ఆమె ఎప్పుడు వెనక్కి వస్తే అప్పుడు నేను ఆనందంగా తప్పుకుంటాను అని.. ఇప్పుడు అదే నిజమైంది. ఇక రోజాకు రాజకీయ మనుగడ లేదు.. ఆమెకు వేరే అప్షన్ కూడా లేదు. అందుకే జబర్దస్త్ నే మళ్లీ నమ్ముకుంటుంది. ఇంకా చెప్పాలంటే వేరే దిక్కు లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
అయితే ఈ పని అయినా రోజా ఎలా చేయగలదు. జబర్దస్త్ లో ఉన్న వాళ్ళందరూ జనసేనకు సపోర్ట్ గా ప్రచారం చేసి.. పవన్ కళ్యాణ్ ను గెలిపించమని అహర్నిశలు పోరాడారు . ఇక ఆ సమయంలో రోజా.. జబర్దస్త్ వాళ్లపై విరుచుకుపడింది. కమెడియన్స్ కూడా రోజా మాటలకు కౌంటర్లు కూడావిసిరారు.

ఇప్పుడు జబర్దస్త్ కు రోజా రీఎంట్రీ ఇస్తే మళ్లీ వారి ముఖాలే చూడాల్సి వస్తుంది. అన్ని మాటలు అన్నాక కూడా ఆమె నవ్వుతూ ఉండగలిగినా.. కమెడియన్స్ మాత్రం లోపల ఒకటి పెట్టుకొని పైకి రోజమ్మ అని పిలవగలరా.. ? రోజాకు పార్టీలు మారడం అలవాటే.. మాటలుమార్చడం అలవాటే.. అలా ఇప్పుడు జబర్దస్త్ లో ఉన్నవారందరూ నా బిడ్డలతో సమానం అని అన్నా ఆశ్చర్యం లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రోజాఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











