ఆ విషయంలో నో చెప్పినా శ్రీకాంత్, శివాజీరాజాలు వదల్లేదు.. స్టార్ యాంకర్ వ్యాఖ్యలు వైరల్

తెలుగునాట టీవీల శకం ప్రారంభమయ్యాక చాలా మంది యాంకర్లుగా జనంలో గుర్తింపు తెచ్చుకున్నారు. సుమ, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి, ఉదయభానులు ఈ కోవలో ముందున్నారు. ఈ స్టార్ యాంకర్ల లిస్ట్‌లోకే వస్తారు అనితా చౌదరి. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే సీరియల్స్‌లోనూ నటించి దుమ్ములేపారు. కస్తూరి, రుతురాగాలు, అమృతం, నాన్న వంటి ధారావాహికలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ క్రమంలో సినిమాల్లోనూ అనితకు అవకాశాలు వెల్లువెత్తాయి. సంతోషం, నువ్వే నువ్వే, మురారి, ఛత్రపతి, గురు, మన్మథుడు, ఉయ్యాల జంపాల, నిన్నే ఇష్టపడ్డాను, జాంబిరెడ్డి, కేరింత, వరుడు చిత్రాల్లో నటించారు.

చివరిసారిగా కరణ్ అర్జున్ మూవీలో నటించిన అనితా చౌదరి.. ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో స్థిరపడ్డారు. ఈటీవీ అభిరుచి ఛానెల్‌లో ఓ ప్రోగ్రామ్ కోసం ఫారిన్‌లో స్థిరపడిన తెలుగువాళ్లని ఇంటర్వ్యూ చేసి సత్తా చాటారు. తన తోటి యాంకర్లు సుమ, ఝాన్సీ, సింగర్ సునీత, నటులు సమీర్, శివాజీరాజాలతో ఆమె సన్నిహితంగా ఉంటారు. హైదరాబాద్‌లో ఉన్నా.. ఫారిన్‌లో ఉన్నా మిత్రులతో నిత్యం టచ్‌లోనే ఉంటారు అనిత చౌదరి. ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆమె తన కెరీర్, ఫ్యామిలీ తదితర అంశాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

actress anitha chowdary made sensational comments on srikanth and sivaji raja over her marriage

తొలినాళ్లలో సీరియల్ నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టి పలు ధారావాహికలు తీశారు. అయితే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినందుకు పలు సందర్భాల్లో బాధపడ్డానని.. తనకు, తన ఇంట్లో వాళ్లకు తాను ప్రొడ్యూసర్‌గా మారడం ఇష్టం లేదన్నారు అనిత. నిర్మాతగా నష్టాలను ఎదుర్కొని.. తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని తెలిపారు. తాను రెండు పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డానని అనితా చౌదరి వెల్లడించారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ, తీన్‌మార్ సినిమాలలో తనకు అవకాశం వచ్చినా.. వాటిలో నటించలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక తన ప్రేమ, పెళ్లి విషయంపైనా అనితా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త నాకొకసారి ప్రపోజ్ చేశారని.. తాను హైదరాబాద్‌ను వదిలి ఏ ఖండానికి రానని తేల్చిచెప్పేశానని అనిత తెలిపారు. తన కుటుంబంలో జరిగిన సంఘటనలతో పెళ్లిపై ఆసక్తి లేదని.. కానీ సూపర్‌స్టార్ కృష్ణను చూసిన తర్వాత ఓపీనియన్ మార్చుకున్నానని, ఆయన ఇందిర గారినీ, విజయనిర్మలను ఒకేవిధంగా చూసుకున్నారని చెప్పారు. తన తల్లి రిచ్ అని, అయినా తన తండ్రి కోసం అందరినీ వదిలేసి ఐదుగురు పిల్లలను పెంచడానికి ఎంతో కష్టపడిందని అనితా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కష్టాలను చూసి తనకు పెళ్లిపై ఆసక్తి తగ్గిపోయిందని చెప్పారు.

actress anitha chowdary made sensational comments on srikanth and sivaji raja over her marriage

తన భర్త హీరో శ్రీకాంత్‌కి కజిన్ అవుతారని.. ఆయన ఓ రోజు ఫోన్ చేసి అమెరికా నుంచి తన కజిన్ వచ్చాడని, నిన్ను పెళ్లిచేసుకుంటానని చెబుతున్నాడని తెలిపారు. శివాజీరాజా కూడా తనకు నచ్చజెప్పడానికి ఎంతో ట్రై చేశాడని ఆమె వెల్లడించారు. అయితే తన అభిప్రాయం తెలుసుకోకుండా.. వాళ్ల ఇంట్లో చెప్పారా అనుకున్నానని, దాని వల్ల ఎన్నో గొడవలు కూడా అవ్వడంతో చాలా ఏళ్లు మాట్లాడుకోలేదని అనిత వెల్లడించారు. కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మాటలు మొదలై .. అప్పుడు కూడా ఇంట్లోంచి బయటకొచ్చి పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని చెప్పానని ఆమె గుర్తుచేసుకున్నారు. తర్వాత తమ పెళ్లి జరిగిందని అనితా చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X