ఇష్టంగానే తుప్పల్లోకి వెళ్లి.. కమిట్ మెంట్లపై అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటి అన్నపూర్ణ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. 1975 నుంచి తెలుగు చలన చిత్రపరిశ్రమలో యాక్టివ్ గా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. 50 ఏళ్లుగా ఆమె ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే వస్తోంది. ప్రస్తుతం మాత్రం బుల్లితెపై తెగ సందడి చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ టెలివిజన్ షోలో కనిపిస్తూ ఆడియెన్స్ ను తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది.
యంగ్ ఆర్టిస్ట్ లకు ధీటుగా అన్నపూర్ణ పంచులు, ప్రాసలతో అలరిస్తోంది. 70 ఏళ్ల వయస్సులోనూ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఈ తరం నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది. మరోవైపు టాలీవుడ్ నిండుతనానికి, సంప్రదాయానికి పెట్టింది పేరుగా ఆమె కెరీర్ ను సాగించింది. ఇప్పటికీ ఆమె అదే బాటలో పయనిస్తున్నారు. సినిమాలు, టీవీ షోలతో కాస్తా బిజీగానే ఉన్న అన్నపూర్ణ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. జబర్దస్త్ నటి వర్ష యాంకర్ గా ఇటీవల వస్తున్న కిసిక్ టాక్స్ షోకు అన్నపూర్ణమ్మ హాజరయ్యారు.

ఈ సందర్భంగా తన కుటుంబ విషయాలు, సినిమాల గురించిన విషయాలను జబర్దస్త్ వర్ష ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ఈక్రమంలోనే అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లను కమిట్ మెంట్ల భూతం వెంటాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై మీటూ అనే ఓ ఉద్యమమే జరిగింది. అయితే ఇప్పటికీ అడపాదడపా కమిట్ మెంట్లకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా అన్నపూర్ణ ఇండస్ట్రీలోని కమిట్ మెంట్లపై ఇలా స్పందించారు.
ఇప్పుడున్న కాలంలో కమిట్ మెంట్లతో నటీమణులు ఇబ్బంది పడుతుండటం వాస్తవమే కావొచ్చు. కానీ సదరు నటీమణులకు ఇష్టం లేకుండానైతే ఎవరూ ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉండదని అన్నారు. కమిట్ మెంట్లకు మేము ఒప్పుకోబోమని తెగేసి చెబితే ఎవ్వరూ ఏమీ చేయలేరు కదా.. నటీమణులు గట్టి నిర్ణయం తీసుకుంటే కమిట్ మెంట్ల గోల పూర్తిగా పోయే అవకాశం ఉందన్నారు. అయితే కానీ తమ ఇష్టంగా కమిట్ మెంట్లకు ఓకే చెప్పి కలిసి సమయం గడిపేందుకు ఒప్పుకున్నాక.. ఇంకా సమస్య ఎక్కడుందన్నారు.
ఇప్పటి వరకు అందరూ తమకు అవగాహన ఉండే లేకనో కమిట్ మెంట్లకు ఒప్పుకుంటున్నప్పుడు ఇంకెవ్వరూ మిమ్మల్ని ఇబ్బందిపెట్టినట్టు కాదుకదా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక తమ కాలంలో అయితే కమిట్ మెంట్లు లేవని చెప్పుకొచ్చారు. ఇలా తుప్పల్లోకి వెళ్లడాలు లేవన్నారు. కానీ తమకు ఇష్టమైన వ్యక్తులతో మాత్రం కలిసి తిరిగేవాళ్లని, ఆ బంధం చాలా స్వచ్ఛంగా, ప్యూర్ గా ఉండేదని చెప్పుకొచ్చారు. కమిట్ మెంట్లకు పరిష్కారం నో చెబితే సరిపోతుందని, ఎవరూ తమ లాక్కేళ్లే పరిస్థితి అయితే లేదు కదా అని చెప్పుకొచ్చారు.
ఇక అన్నపూర్ణ ప్రస్తుతం టీవీ షోల్లో కనిపిస్తూ తన అభిమానులను, తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఆమె కెరీయర్ లో మొత్తం 900కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఆమె కెరీయల్ బెస్ట్ పెర్ఫామెన్స్ కు గాను 3 నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











