అర్ధరాత్రి అతడితో దొరికిపోయిన ఆరియానా.. పార్టీకి వెళ్లి చేయకూడని పని చేస్తూ బుక్

ఆరియానా గ్లోరీ.. తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని పేరిది. అంతలా ఈ చిన్నది చాలా తక్కువ సమయంలోనే తనదైన అందం, అభినయంతో మెప్పించి సెన్సేషన్ అయింది. దీనికితోడు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. దీంతో చాలా కాలంగా అస్సలు తీరిక లేకుండా గడుపుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా అర్ధరాత్రి సమయంలో ఆరియానా గ్లోరీ ఓ చేయకూడని పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసమే!

అప్పట్లోనే సెన్సేషన్‌గా
ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అలా సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసింది. ఆ సమయంలోనే కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి పెద్ద ఓ రేంజ్‌లో రచ్చ చేశారు. ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో ఆరియానా సంచలనంగా మారిపోయింది. దీంతో ఈ బ్యూటీ పేరు మోత మోగిపోయింది.

Actress Ariyana Glory Palakura Thefting Video Gone Viral In Social Media

ఒక్క షో స్టార్‌గా మార్చి
సోషల్ మీడియా వల్ల ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్న ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం వచ్చింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో మెప్పించింది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడు పలుమార్లు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా, హోస్టుగా చేసింది. దీంతో ఆరియానా గ్లోరీ సెలెబ్రిటీ అయింది.

తగ్గిన మూవీ చాన్స్‌లు
బిగ్ బాస్ అవకాశాల వల్ల యమా హైలైట్ అయిన ఆరియానా గ్లోరీ.. ఆ తర్వాత వరుసగా ఎన్నో షోలు, సినిమాలు చేసి హవాను చూపించింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో అదరగొట్టేసిన ఈ జోడీ రన్నరప్‌‌‌గా నిలిచి సత్తా చాటింది. దీని తర్వాత నుంచి ఆరియానాకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు.

Actress Ariyana Glory Palakura Thefting Video Gone Viral In Social Media

అక్కడ మాత్రం ఫుల్లే
ఆరియానా గ్లోరీ సోషల్ మీడియా వల్లే సెన్సేషన్ అయింది. కాబట్టి ఇందులో ఈ భామ నిరంతరం యాక్టివ్‌గానే ఉంటోంది. అంతేకాదు, క్రమం తప్పుకుండా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతూ తన ఫాలోవర్లను అలరిస్తోంది. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ కూడా ఇస్తూ దూసుకెళ్తోంది.

దొంగతనం చేసింది
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న బోల్డు లేడీ ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ డిఫరెంట్ వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో విభిన్నమైన రీల్స్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె అర్ధరాత్రి సమయంలో దొంగతనం చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Actress Ariyana Glory Palakura Thefting Video Gone Viral In Social Media

ఆ వీడియో వైరల్‌‌గా
తాజాగా షేర్ చేసిన వీడియోలో ఆరియానా గ్లోరీ.. బిగ్ బాస్ ఫేం జస్వంత్ పడాల అలియాస్ జెస్సీతో కలిసి ఓ పార్టీకి హాజరైంది. ఆ తర్వాత ఒక పొలం దగ్గర కారు ఆపి అక్కడ సాగులో ఉన్న పాలకూరను ఆరియానా దొంగతనం చేసింది. ఇదంతా జెస్సీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఇక, ఆమె దొంగతనం చేస్తూ ముగ్గురు కుర్రాళ్లకు దొరికిపోవడం కనిపించింది.

నెటిజన్ల విమర్శలు
ఆరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన దొంగతనం వీడియో చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది. ఇక, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కొందరైతే ఆమె చేసిన పనికి విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఎందుకు షేర్ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆరియానా ఫన్నీగా చేసిన ఈ వీడియో ఇప్పుడు హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X