పక్కింట్లో కపుల్ రొమాన్స్.. ఆ కోరిక తీర్చుకోవాలని ఆరియానా ప్లాన్
తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు పలు రకాల కారణాల వల్ల హాట్ టాపిక్ అయిపోయారు. అలాంటి వారిలో బోల్డు లేడీ ఆరియానా గ్లోరీ ఒకరు. తనదైన అందం, అభినయంతో మాయ చేస్తోన్న ఈ చిన్నది.. ముఖ్యంగా తన వ్యవహార శైలితో హైలైట్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో అయితే మరింతగా హల్చల్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆరియానా గ్లోరీ సుమ అడ్డా షోలో పాల్గొంది. ఇందులో ఎవరూ ఊహించని రీతిలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పింది? ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!

ఆర్జీవీ వల్ల సెన్సేషన్
యూట్యూబ్ యాంకర్‌గా ఆరియానా గ్లోరీ కెరీర్‌ను మొదలు పెట్టింది. అలా సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేసింది. ఆ సమయంలోనే కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఇద్దరూ కలిసి పెద్ద ఓ రేంజ్‌లో రచ్చ లేపేశారు. ఈ వీడియోను వర్మ షేర్ చేయడంతో ఆరియానా సంచలనంగా మారిపోయింది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగిపోయింది.
ఒక్క షోతో ఫుల్ క్రేజ్
సోషల్ మీడియా వల్ల సెన్సేషన్ అయిపోయిన ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం వచ్చింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ భామ.. డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్‌తో మెప్పించింది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడు పలుమార్లు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా, హోస్టుగా చేసింది. దీంతో ఆరియానా గ్లోరీ బిగ్ సెలెబ్రిటీగా మారిపోయింది.

సినిమాలు తగ్గాయి
బిగ్ బాస్ షోల వల్ల ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న ఆరియానా గ్లోరీ.. ఆ తర్వాత వరుసగా ఎన్నో షోలు, సినిమాలు చేసి హవాను చూపించింది. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో అదరగొట్టేసిన ఈ జోడీ రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. దీని తర్వాత నుంచి ఆరియానాకు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి.
షోలో వాళ్లతో ఫుల్లు
ఆరియానా గ్లోరీ ఈ మధ్య కాలంలో పెద్దగా అవకాశాలను దక్కించుకోకున్నా షోలు, ఈవెంట్లలో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ముక్కు అవినాష్, రోల్ రైడా, శ్రీ సత్యతో కలిసి 'సుమ అడ్డా' అనే షోలో పాల్గొంది. ఇందులో అందరితో కలిసి తెగ సందడి చేసింది. ముఖ్యంగా ఈ షోలో ముక్కు అవినాష్ తనదైన కామెడీతో అలరించి ఓ రేంజ్‌లో మెప్పించాడు.
రొమాన్స్ చూడాలి
'సుమ అడ్డా' షోలో భాగంగా యాంకర్ సుమ 'ఎలాంటి సందర్భంలో మనం పక్కింట్లోకి దొంగచాటుగా చూస్తుంటాము' అని ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఆరియానా గ్లోరీ 'పక్కింట్లో ఎవరైనా రొమాన్స్ చేసుకుంటూ ఉంటే నాకు చూడాలని కోరిక' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











