డిన్నర్‌కు పిలిస్తే వెళ్లకండి.. జరిగేది ఇదే.. ఇండస్ట్రీ సీక్రెట్ బయటపెట్టిన నటి

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు నటి అస్మిత కర్ణని (Actress Ashmitha). రాజస్థాన్ కు చెందిన అశ్మిత, తెలుగులో పద్మవ్యూహం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆ సీరియల్‌లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత వరుసగా అనేక సీరియల్స్‌లో అవకాశాలు అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా అగ్నిసాక్షి సీరియల్‌లో భైరవి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. అలాగే మురారి, అపుడప్పుడు, మధుమాసం వంటి సినిమాల్లో కూడా నటించింది. సినిమాల్లో కూడా తన ప్రతిభ చాటుకున్నప్పటికీ, ప్రధానంగా బుల్లితెర ద్వారానే ఎక్కువ గుర్తింపు పొందింది.

పెళ్లి తర్వాత అశ్మిత పెద్దగా స్క్రీన్‌పై కనిపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, తన వ్యక్తిగత జీవితం, ట్రావెల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వంటి విషయాలను పంచుకుంటోంది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'ఎవరైనా డిన్నర్‌కు పిలిస్తే వెళ్లకండి' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సమయంలో తాను సినీ రంగంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

Actress Ashmitha Karnani Shocking Warning to Junior Artists Don t Accept Dinner Invitations in Industry

నటి అస్మిత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టే జూనియర్ ఆర్టిస్టులకు ఆమె పలు సూచనలు చేసింది. ముఖ్యంగా 'ఎవరైనా బయటికి డిన్నర్‌కు వెళ్దాం, డ్రైవ్‌కు వెళ్దాం అని పిలిస్తే అసలు వెళ్లకండి' అంటూ ఆమె స్పష్టంగా సూచించింది. మొదట్లో తాను కూడా ఇలాంటి ఆహ్వానాలను సాధారణంగా తీసుకున్నానని తెలిపింది.

'కాలేజీలో ఫ్రెండ్స్ కలిసి బయటికి వెళ్లినట్టే.. ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసే వాళ్లతో అలానే ఉండాలని భావించేదాన్ని. డిన్నర్‌కు పిలిస్తే అందులో తప్పేం ఉంది అనుకునేదాన్ని. కానీ మెల్లమెల్లగా ఆ పదానికి ఇక్కడ వేరే అర్థం ఉంటుందని అర్థమైంది'అని ఆమె చెప్పింది. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు చాలా కామన్ అని ఆమె వెల్లడించింది. 'ఇవి ఒక్కోసారి సిచువేషనల్‌గా కాకుండా, ప్లాన్ చేసి చేసే విషయాలు కూడా ఉంటాయి'అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

తనకు ఎదురైన ఒక సంఘటనను అస్మిత వివరించారు. 'నేను ఫిలిం సిటీలో ఓ సీరియల్ చేస్తున్నప్పుడు, ఒక సీనియర్, పాపులర్ యాక్టర్ ఫుల్ టీమ్‌తో కలిసి డిన్నర్‌కు రమ్మని పిలిచారు. అంత పెద్ద యాక్టర్ నన్ను ఆహ్వానించడంతో నేను చాలా ఎగ్జైటెడ్ అయ్యా. ఇంట్లో వాళ్లకు కూడా చెప్పి వెళ్లాను'అని తెలిపింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆమెకు షాక్ ఇచ్చాయి. 'డిన్నర్ అయిపోయాక ఒక్కొక్కరుగా టీమ్ సభ్యులు వెళ్లిపోయారు. చివరకు అక్కడ నేను, ఆ యాక్టర్ మాత్రమే మిగిలాం. ఆ సమయంలో ఆయన నాతో 'మీరు చాలా అందంగా ఉన్నారు' అంటూ మాట్లాడటం ప్రారంభించారు. కానీ ఇక్కడ ఆ మాటకు కూడా వేరే అర్థం ఉంది. ఆ విషయం అర్థం చేసుకున్నా..'అంటూ చెప్పింది.

ఆ యాక్టర్ తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని, కానీ తాను చాకచక్యంగా పరిస్థితిని, మాటలతో హ్యాండిల్ చేసి అక్కడి నుంచి బయటపడ్డానని అస్మిత వెల్లడించింది. ఇలా ఒక్కసారి కాదు, రెండు మూడు సార్లు ఇలాంటి సందర్భాల నుంచి బయటపడ్డానని ఆమె తెలిపింది. ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ ఉంటారని, కాబట్టి యంగ్ యాక్టర్స్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అస్మిత సూచించింది. 'పార్టీలు, పబ్బులు, ఫ్రెండ్స్ అంటూ తిరగడం వల్ల అవకాశాలు వస్తాయని భావించొద్దు. ప్రతిదాంట్లో జాగ్రత్త అవసరం' అని ఆమె స్పష్టం చేసింది. తన అనుభవాల తర్వాత ఇకపై ఇలాంటి పార్టీలు, డిన్నర్ ఇన్వైట్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని కూడా తెలిపింది.

More from Filmibeat

Read more about: entertainment tollywood ashmita
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X