Bigg Boss 7 Ashwini Sri: బిగ్ బాస్‌కి మరో హాట్ బాంబ్.. రష్మిక మందన్న అక్క వచ్చేసింది రోయ్..!
బిగ్ బాస్ 2.ఓ గ్రాండ్ లాంఛ్ ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభం అయింది. నాగార్జున వైల్డ్ కార్డు ద్వారా పలువురు కంటెస్టెంట్స్ ను హౌజ్ లోకి పంపించారు. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయిన భామల్లో ఒకరు అశ్విని శ్రీ. ఈమె బిగ్ బాస్ హౌజ్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఈ భామ ఓ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. అసలు ఎవరీ అశ్విని శ్రీ.. 34 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఏ సినిమాల్లో నటించింది..? ఆమె బయోగ్రఫి ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ఘనంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ 2.ఓ మాత్రం అక్టోబర్ 8న గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఇక ఈ 2.ఓలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా నటి హీరోయిన్ అశ్విని శ్రీ ఎంటర్ అయింది. ఈ భామ రావడం రావడమే అందరి దృష్టిని ఆకర్షించింది. అశ్విని శ్రీ కంటెస్టెంట్ గా మొత్తానికి హౌజ్ లో ప్రవేశించింది.

అసలు ఈ అశ్విని శ్రీ ఎవరంటే... ఆమె ఓ నటి. అంతే కాదు.. హీరోయిన్ గా ఓ చిత్రంలో నటించింది. అమీర్ పేటలో అనే చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా చేసింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేశ్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న అక్కగా ఈ భామ కనిపిచింది. కనిపించింది కొద్దిసేపు అయినా.. సినిమాలో నవ్వులు పూయించింది. ఇక ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
అశ్విని శ్రీ గురించి చెప్పాలంటే.. హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. వయసు 34ఏళ్లు. ఈ హాట్ బామ ఇప్పుడు బిగ్ బాస్ లో అడుగుపెట్టింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. అందులో షేర్ చేసిన పిక్స్ చూస్తే.. ఈ భామ బోల్డ్ అని కూడా అర్థం అవుతుంది. ఇక బిగ్ బాస్ హౌజ్ కు మరింత గ్లామర్ డోస్ ఈ భామతో యాడ్ కాబోతుంది. ఇప్పటికే ఈ షోలో ఐదుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

ఇప్పుడు అశ్విని శ్రీ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ లో గ్లామర్ డోస్ పెరగనుంది. అయితే ఈ భామ ప్లేస్ లో ముందుగా అంజలి పవన్ రావాల్సింది. కానీ ఆమె రెమ్యూనరేషన్ విభేదాలతో తప్పుకోవడంతో.. ఈ భామకు ఛాన్స్ దక్కింది. ఇప్పటికే బయట నుంచి బిగ్ బాస్ గేమ్ చూసిన ఈ భామ.. ఇప్పుడు ఇంట్లోకి వెళ్లి ఆడనుంది.
కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడంతో ఇప్పటికే ఉన్న వారి నుంచి గట్టి పోటీ అయితే ఏర్పాడుతుంది. అలాగే బయట ఇప్పటివరకు ఆట చూసి.. హౌస్ లో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అనేది తెలుసుకుని వెళ్తారు. కొత్త వాళ్లకి ఇది ప్లస్ అవుతుంది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి అశ్వినీ శ్రీ లోపలికి వెళ్లింది. మరి ఈ భామ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూాడాలి. ఇక తెలుగు ఫిల్మీబీట్ నుంచి అశ్వినీ శ్రీకి ఆల్ ది బెస్ట్.


Click it and Unblock the Notifications











