హాట్ షోలో హద్దు దాటిన దివి: ఏకంగా స్నానం చేస్తోన్న పిక్ వదలడంతో!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు అమ్మాయిలు కూడా తెగ హడావిడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొందరైతే అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్నారు. తద్వారా అందరి దృష్టిలో పడడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుంటోన్నారు. ఇలా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేం దివి వాధ్యా ఒకరు. తెలుగు రాష్ట్రానికి చెందిన ఈ అమ్మడు ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. అలాగే, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపును అందుకుంది. ఇక, సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్‌చల్ చేస్తూ ఫేమస్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దివి వాధ్యా స్నానం చేస్తోన్న పిక్‌ను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం.. ఫేమస్ కాలేదు
మోడల్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా వెండితెరపైకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలో కీలక పాత్రను పోషించింది. ఇలా చాలా సినిమాల్లో మెరిసినా దివికి గుర్తింపు రాక ఫేమస్ అవలేదు.

బిగ్ బాస్‌లోకి వెళ్లడంతో మారింది
చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన దివి వాధ్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. నిజాయితీగా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంది.

ఫుల్ ఆఫర్లు.. చిరంజీవి సినిమానే
బిగ్ బాష్ షోలో మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయినా.. దివి వాధ్యాకు మాత్రం ఇది చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి. దీనికి కారణం.. ఈ షో తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా స్పీడ్ అందుకుంది. బిగ్ బాస్ ఫినాలేకు గెస్టుగా వచ్చిన చిరంజీవే.. ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అంతేకాదు, 'భోళా శంకర్' సినిమాలో చాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. అలా చాలా ఆఫర్లు అందుకుంది.

హాట్ సీన్‌తో ఫేమస్.. ఫుల్ బిజీగా
బిగ్ బాస్ పుణ్యమా అని దివి వాధ్యా వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంత హైలైట్ అయింది. ఇది తెగ వైరల్ అవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమానే కాదు.. ఈ బ్యూటీ 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీలో నటించింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
నటిగా ఫేమస్ అవడానికి ముందు నుంచే దివి వాధ్యా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ గత ఏడాది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గానూ ఎంపికైంది. అలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారింది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతోందిగా
కెరీర్ పరంగా వరుస సినిమాలతో దూసుకుపోతోన్న దివి వాధ్యా.. సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతోంది. ఫలితంగా తరచూ హైలైట్ అవడంతో పాటు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

బిగ్ బాస్ దివి హాట్ ఫొటో వైరల్
టాలీవుడ్ చిన్నది దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్నానం చేస్తూ కొంటె చూపులతో కవ్విస్తోంది. అలా అందాల విందు చేస్తోంది. ఫలితంగా ఈ సొట్టబుగ్గల సుందరి హాట్ ట్రీట్‌కు అంతా ఫిదా అవుతున్నారు. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











