కొడితే కొరియాలో వెళ్లి పడ్తావ్.. సుడిగాలి సుధీర్‌పై ఫరియా అబ్దుల్లా, అనిల్ రావిపూడి ఫైర్

యంగ్ అండ్ టాలెంటెడ్ యాంకర్, హీరో సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టీవీ ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్ గా వందల స్కిట్లలో నటించారు. బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇదే సమయంలో బుల్లితెరపై టాప్ సెలెబ్రెటీగా సుడిగాలి సుధీర్ క్రేజ్ దక్కించుకున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు. ఆ క్రేజ్ తోనే సుడిగాలి సుధీర్ హీరోగానూ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో సుడిగాలి సుధీర్ హీరోగా కూడా పలు సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుడిగాలి సుధీర్ పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. స్టార్ హీరోల చిత్రాల్లో కామెడీ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక సమయం అనుకూలించడం తానే హీరోగా కూడా పలు సినిమాలు చేసి ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యారు. బుల్లితెర నుంచి వెండితెర పైకి వచ్చి తన నటనతో, ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా అలరించాడు. కమెడియన్ గానే కాకుండా తనలోని నటుడిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.

Actress Faria Abdullah and Director Anil Ravipudi funny counter to Anchor Sudigali Sudheer

కాలింగ్ సహస్త్ర, సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వెండితెరపై సుడిగాలి సుధీర్ తన అభిమానులను వెండితెరపై అలరిస్తూ వస్తున్నారు. గాలోడు చిత్రం మాస్ ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. అయితే ఇటీవల మాత్రం హీరోగా సినిమాలు కాస్తా ఆలస్యంగా మారుతున్నాయి. ఇక ఇదే సమయంలో సుడిగాలి సుధీర్ టీవీ షోలతో మాత్రం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు రియాలిటీ గేమ్ షో సర్కార్ తో అలరించాడు. ఇక ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప : లిటిల్ ఛాంప్స్ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సింగింగ్ కాంపిటీషన్ షోకు టాలీవుడ్ టాప్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, సింగర్ ఎస్పీ శైలజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈషోకు సంబంధించిన ఫుల్ ప్రోమోను విడుదల చేశారు. ప్రస్తుతం ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో షోకు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫరియా అబ్దుల్లాతో కలిసి రొమాంటిక్ స్టెప్పులు వేస్తూ వేదికపై రచ్చరచ్చ చేసింది.

వారిద్దరినీ సుడిగాలి సుధీర్ అడ్డుకున్నాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా సుడిగాలి సుధీర్ పై ఫైర్ అయ్యింది. మధ్యలో అడ్డుకున్నావో కొడితే కొరియాలో వెళ్లి పడ్తావ్ అంటూ మండి పడింది. ఆ వెంటనే సుడిగాలి సుధీర్ ను చూస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి నవ్వు ఆపులేకపోయాడు. అనిల్ రావిపూడి సుడిగాలి సుధీర్ పై ఫన్నీ కామెంట్లు పేల్చడం ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. ఈ షో ఫుల్ ఎపిసోడ్ రేపు అనగా సెప్టెంబర్ 26 శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X