‘బిగ్ బాస్’ వివాదం... తవ్విన కొద్దీ షాకయ్యే విషయాలు, నిజమా?

నాగార్జున హోస్ట్‌గా త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షోపై వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ షోలో ఎంపిక ప్రక్రియ సరిగా లేదని, అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్న తర్వాత కో ఆర్డినేటర్ల ప్రవర్తన అభ్యంతరకంగా ఉంది అంటూ శ్వేతారెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

శ్వేతా రెడ్డి లాంటి అనుభవమే నటి గాయిత్రి గుప్తాకు ఎదురైంది. ఆమె కూడా ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడానికి ముందు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ తనకు ఎదురైన షాకింగ్ అనుభవాలు వెల్లడించారు.

ఆరు ప్రాజెక్టులు పోగొట్టుకున్నాను

ఆరు ప్రాజెక్టులు పోగొట్టుకున్నాను

బిగ్ బాస్ విషయంలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా వీటిని నేను లైట్ తీసుకున్నాను.. ఎందుకంటే నేను వాటిని చూడలేదు, వినలేదు కాబట్టి. ఇపుడు నా వరకు వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడాలనిపించింది. బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్ సరిగా లేదు. వారు చేసే ప్రామిసెస్ కరెక్టుగా లేవు. అగ్రిమెంట్ బాండ్ మీద సంతకం చేసిన రెండు నెలల తర్వాత మీరు లేరు అని డిక్లేర్ చేయడం వల్ల నేను ఆల్రెడీ కమిటైన ఆరు ప్రాజెక్టులు పోగొట్టుకున్నాను. దానికి పరిహారం అడిగితే వారి దగ్గర నుంచి జవాబు లేదు. ఫోన్ కూడా ఎత్తడం లేదని గాయిత్రి గుప్తా తెలిపారు.

వంద రోజులుసెక్స్ లేకుండా ఉండగలవా? అన్నారు

వంద రోజులుసెక్స్ లేకుండా ఉండగలవా? అన్నారు

అగ్రిమెంటు మీద సంతకం పెట్టిన తర్వాత ముంబై స్టార్ మా నుంచి వచ్చిన అభిషేక్ అనే వ్యక్తి... ‘బిగ్ బాస్ ఇంట్లో 100 రోజులు ఉండగలవా? నువ్వు ఫ్యామిలీ మిస్సవుతావా? వంద రోజులుసెక్స్ లేకుండా ఉండగలవా? అని అడిగారు. మన మైండ్‌తో ఆడే గేమ్ షోలో దాంతో పనేంటి? అలాంటి ప్రశ్నలు అడగటం ఎంత వరకు కరెక్ట్ అని నేను ప్రశ్నించాను. నా హెల్త్ సమస్యలు, షోలో నేను ఎంత వరకు చేయగలనో అతడికి వివరించినట్లు గాయిత్రి గుప్తా తెలిపారు.

అగ్రిమెంట్ అయ్యాక మీకు ఛాన్స్ లేదు అన్నారు

అగ్రిమెంట్ అయ్యాక మీకు ఛాన్స్ లేదు అన్నారు

రెండు నెలల తర్వాత మాటీవీ నుంచి రఘుగారు ఫోన్ చేసిన మీకు అవకాశం ఉండక పోవచ్చు... వేరే ప్రాజెక్టులు ఉంటే ఒప్పుకోండి అన్నారు. బాండ్ సైన్ చేసిన తర్వాత అలా ఎలా చేస్తారు? అని అడిగితే వారి నుంచి సమాధానం లేదు. మా టీవీ ఆఫీసుకు వెళ్లితే అలోక్ గారిని కూడా కలవనీయలేదు. నా ఫ్రెండ్స్ ద్వారా శ్యాం అనే వ్యక్తి షో హెడ్ అని తెలుసుకుని అతడి ఫోన్ నెంబర్ తీసుకుని కాంటాక్ట్ అయితే.... కొన్ని రోజుల తర్వాత శ్యాం, రఘు ఇద్దరూ కలిశారు. ఆ రోజు మీటింగులో శ్యాం... మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? టీఆర్పీలు పెంచడానికి మీరు ఎలా సహాయ పడతారు? అని ప్రశ్నించారు... అని గాయిత్రి గుప్తా గుర్తు చేసుకున్నారు.

ఆ విషయం ముందు అడగాల్సింది

ఆ విషయం ముందు అడగాల్సింది

నన్ను ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న నన్ను మొదటిసారి కలవకముందు, బాండ్ మీద సైన్ చేయకముందు అడగాల్సింది. అన్ని అయిపోయి, రెమ్యూనరేషన్ మాట్లాడుకున్న రెండున్నర నెలల తర్వాత ఈ ప్రశ్న అడగటం చాలా స్టుపిడ్‌గా అనిపించింది. నన్ను నేను తక్కువ చేసుకున్న ఫీలింగ్ కలిగింది. ఈ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను.

గొడవలు పడాలని చెప్పారు

గొడవలు పడాలని చెప్పారు

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నవారితో మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? అని అడితే నేను లేవని చెప్పాను... గొడవలు లేకపోతే, డ్రామా క్రియేట్ చేయకపోతే టీఆర్పీలు ఎలా వస్తాయి? మీకు హౌస్‌లో పోట్లాడాలి, గొడవలు పడాలి అని చెప్పారు.

అపుడు లైట్ తీసుకున్నాను,కానీ...

అపుడు లైట్ తీసుకున్నాను,కానీ...

గత సీజన్లో మాధవిలత బిగ్ బాస్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పినపుడు ఎవరూ పట్టించుకోలేదు. నేను బయటకు వచ్చి చెప్పినా ఎవరూ పట్టించుకోరు అని లైట్ తీసుకున్నాను. శ్వేతారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఇలా జరిగిందని చెప్పడంతో నాకు కూడా ఇదే జరిగింది కదా నేనెందుకు సైలెంటుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ విషయం బయట పెట్టినట్లు.... గాయిత్రి గుప్తా తెలిపారు.

చాలా మంది బయటకు మాట్లాడలేక పోతున్నారు

చాలా మంది బయటకు మాట్లాడలేక పోతున్నారు

గతంలో కాస్టింగ్ మేనేజర్ ఒకరు కూడా అభిషేక్ కాస్టింగ్ కౌచ్ విషయాలు అడుగుతున్నారు, ఆయనకు నాకు గొడవలు అయ్యాయి, అమ్మాయిలను కూడా అతడి వద్దకు రిఫర్ చేయడం లేదు అని చెప్పారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా నాకు ఈ విషయాలు చెప్పారు. బిగ్ బాస్ అగ్రిమెంటులో షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెగెటివ్ గా మాట్లాడకూడదు అనే క్లాజ్ ఉంది. దాని వల్ల వారు బయటకు వచ్చి మాట్లాడలేక పోతున్నారని గాయిత్రి వెల్లించారు.

నాకు పరిహారం కావాలి

నాకు పరిహారం కావాలి

ఒక అమ్మాయి తనకు ఇలా జరిగింది అని చెప్పే ధైర్యం కూడా చేయలేని విధంగా క్లాజెస్ ఆ బాండ్ పేపర్లలో ఉన్నాయి. ఇలాంటివి మన సొసైటీలో ఎంకరేజ్ చేయడం ఎంత వరకు కరెక్ట్. ఇలాంటి షో గురించి, ఇందులో జరుగుతున్న భాగోతం గురించి మాట్లాడకపోతే ఎలా అనిపించింది. అందుకే బయటకు వచ్చి ఈ విషయాలు మాట్లాడుతున్నాను. నా వద్ద ఉన్న ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఏదో ఒక మంచి జరుగాలనే ఇదంతా చేస్తున్నాను. 2 నెలల్లో నాకు జరిగిన నష్టానికి పరిహారం కావాలని... అని గాయిత్రి గుప్తా డిమాండ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X