For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ హరితేజ రొమాన్స్ వీడియో వైరల్: ముద్దుల వర్షం కురిపిస్తూ రచ్చ

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది భామలు యాంకర్లుగా సందడి చేశారు. అందులో కొందరు మాత్రం ఇప్పుడు వెండితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో తెలుగు భామ హరితేజ ఒకరు. సీరియల్ నటి నుంచి యాంకర్‌గా మారిన ఈ భామ.. ఇప్పుడు వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అలాగే, పర్సనల్ లైఫ్‌ను కూడా బాగానే ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా యాంకర్ హరితేజ భర్తతో కలిసి రొమాంటిక్‌గా తీసుకున్న ఓ కిస్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

  అలా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్

  అలా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్

  కూచిపూడి డ్యాన్సర్‌గా హరితేజ కెరీర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చి 'మనసు మమత' సీరియల్‌తో సుపరిచితురాలు అయింది. ఆ తర్వాత 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్ చేసింది. తద్వారా ఫుల్ ఫేమస్ అయింది.

  ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

  యాంకర్ సత్తా చాటిందిగా

  యాంకర్ సత్తా చాటిందిగా

  వరుసగా సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తోన్న సమయంలోనే హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా మారింది. ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను నడిపించింది. తద్వారా బెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేసి మెప్పించింది.

  బిగ్ బాస్‌తో కెరీర్ స్పీడుగా

  బిగ్ బాస్‌తో కెరీర్ స్పీడుగా


  వరుసగా షోలు, సీరియళ్లు చేస్తోన్న సమయంలోనే హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే ఛాన్స్ లభించింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ ప్రేక్షకుల మెప్పు పొందింది. తద్వారా అందరి హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేకు చేరింది. అయితే, ఇందులో గెలవకున్నా అప్పటి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా స్పీడ్ అందుకుంది.

  హీరోయిన్ హన్సిక అందాల ఆరబోత: పెళ్లైన కొత్తలోనే ఊహించని విధంగా హాట్ షో

  వరుస సినిమాలతో సత్తా

  వరుస సినిమాలతో సత్తా

  బుల్లితెరపై చాలా కాలం పాటు హవాను చూపించిన హరితేజ.. సినిమాల్లోకి కూడా ఎంటరైంది. 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' అనే చిత్రంతో మొదలైన ఆమె ప్రయాణం.. సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇక, 'అఆ'లో ఆమె చేసిన పాత్ర బెస్ట్ అనొచ్చు. ఇక, ఆమె కెరీర్‌లో 'దమ్ము', 'గబ్బర్ సింగ్', 'యూటర్న్', 'హిట్', 'ఎఫ్2', 'జాంబీ రెడ్డి' చిత్రాలు పేరు తెచ్చాయి.

  తల్లైన బ్యూటీ... రీఎంట్రీ

  తల్లైన బ్యూటీ... రీఎంట్రీ


  కెరీర్ ఆరంభంలోనే హరితేజ.. దీపక్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ జంటకు కొన్నేళ్ల క్రితమే ఓ పాప జన్మించింది. ఆ సమయంలో కెరీర్‌కు బ్రేక్ తీసుకున్న ఈ భామ.. 'హరి కథలు' అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో ఎన్నో వీడియోలు చేసింది. మళ్లీ 'గని' మూవీతో కెరీర్ రీస్టార్ట్స్ చేసి.. ఇప్పుడు 'భోళా శంకర్' సహా పలు చిత్రాల్లో భాగం అవుతోంది.

  బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!

  సోషల్ మీడియాలో బిజీ

  సోషల్ మీడియాలో బిజీ

  వరుసగా సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న హరితేజ.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ ముందుకెళ్తోంది.

  రొమాన్స్.. కిస్‌ పెడుతూ

  రొమాన్స్.. కిస్‌ పెడుతూ

  సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా రచ్చ చేస్తోన్న హరితేజ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమెను భర్త దీపక్ వెనుక నుంచి కౌగిలించుకుని.. బుగ్గలపై తెగ ముద్దులు పెట్టేశాడు. ఆ సమయంలో ఆమె క్యూట్ ఎక్స్‌ఫ్రెషన్స్‌ పెట్టి కనిపించింది. ఫలితంగా ఈ వీడియోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.

  English summary
  Anchor and Actress Hari Teja Very Active in Social Media. Recently She Shares Romantic Video in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X