గ్లామర్ తెర తీసేసిన యాంకర్ హరితేజ: పైన ఏమీ లేకుండానే పచ్చిగా ఫోజులు

ఆకట్టుకునే అందం, అదిరిపోయే యాక్టింగ్ చేసే నైపుణ్యం ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిలు ఆశించిన రీతిలో అవకాశాలను సొంతం చేసుకోవడం లేదు. అయినప్పటికీ కొందరు మాత్రం తమదైన రీతిలో అలరిస్తూ హైలైట్ అవుతున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది ప్రముఖ నటి హరితేజ. మొదట్లో యాంకర్‌గా సత్తా చాటిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో మాత్రం నటిగా సినీ రంగంలో సందడి చేస్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ హరితేజ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి!

సీరియల్ నటిగా పాపులర్
హరితేజ ముందుగా కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్ మొదలెట్టింది. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టి 'మనసు మమత' సీరియల్‌లో నటించి హైలైట్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు పోటెత్తాయి. ఫలితంగా 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్‌తో ఫుల్ పాపులర్ అయింది.

Actress Hari Teja Latest Fantastic Photos Goes Viral In Social Media

యాంకర్ సత్తా చాటింది
సీరియల్ నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా మారిపోయింది. ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం నడిపించింది. తద్వారా మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో సత్తా చాటింది.

బిగ్ బాస్‌తో సంచలనం
నటిగా, యాంకర్‌గా అలరిస్తోన్న సమయంలోనే హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే ఛాన్స్ లభించింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే, ఇందులో గెలవకున్నా అప్పటి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.

Actress Hari Teja Latest Fantastic Photos Goes Viral In Social Media

ఫుల్ మూవీస్.. నరేష్‌తో
బుల్లితెరపై సత్తా చాటిన హరితేజ 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాతో బిగ్ స్క్రీన్‌పైకి కూడా వచ్చింది. అలా ఎన్నో సినిమాలు చేసింది. 'అఆ'లో ఆమె చేసిన పాత్ర హైలైట్ అయింది. ఇక, ఆమె కెరీర్‌లో 'దమ్ము', 'గబ్బర్ సింగ్', 'యూటర్న్', 'హిట్', 'ఎఫ్2', 'జాంబీ రెడ్డి' వంటివి చేసింది. తాజాగా 'ఆ ఒక్కటీ అడక్కు'లోనూ కనిపించింది.

సోషల్ మీడియాలో బిజీ
చాలా ఏళ్లుగా సీరియల్ నటిగా, యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న హరితేజ.. వరుస ఆఫర్లతో బిజీగా ఉంటోంది. అయినా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటూ వెళ్తోంది.

Actress Hari Teja Latest Fantastic Photos Goes Viral In Social Media

హరితేజ గ్లామర్ ట్రీట్‌తో
సోషల్ మీడియాలో హరితేజ అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్‌ అండ్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె అందాలు తెగ హైలైట్ అవుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X