బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!
బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!
గతంలో తెలుగు బుల్లితెరపై చాలా మంది భామలు యాంకర్లుగా సందడి చేశారు. అందులో కొందరు మాత్రమే అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో హరితేజ ఒకరు. టీవీ రంగం నుంచి పరిచయమైనా.. సినిమా నటిగా కెరీర్‌ను కొనసాగిస్తోన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హరితేజ కొన్ని హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అలా పాపులర్ అయిన హరితేజ
హరితేజ కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టి 'మనసు మమత' సీరియల్‌లో నటించి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్ చేసింది. తద్వారా ఫుల్ పాపులర్ అయిపోయింది.

యాంకర్‌గా మరింతగా ఫేమస్
వరుస పెట్టి సీరియళ్లు చేస్తోన్న సమయంలోనే హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం హోస్ట్ చేసింది. తద్వారా బెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుని సత్తా చాటింది. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేసింది.

ఒక్క షో ఆమె కెరీర్ మార్చింది
నటిగా, యాంకర్‌గా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేకు చేరింది. అయితే, ఇందులో గెలవకున్నా అప్పటి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా మారి సత్తా చాటుతోంది.

సినిమాల్లోనూ సత్తా.. ఫుల్ బిజీ
సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై హవాను చూపించిన హరితేజ.. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'తో మొదలైన ఆమె ప్రయాణం.. సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇక, 'అఆ'లో ఆమె చేసిన పాత్ర బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక, ఆమె కెరీర్‌లో 'దమ్ము', 'గబ్బర్ సింగ్', 'యూటర్న్', 'హిట్', 'ఎఫ్2', 'జాంబీ రెడ్డి' చిత్రాలు పేరు తెచ్చాయి.

తల్లైన బ్యూటీ.. రీఎంట్రీ ఇచ్చి
హరితేజ.. దీపక్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు కొన్నేళ్ల క్రితమే ఓ పాప జన్మించింది. ఆ సమయంలో కెరీర్‌కు బ్రేక్ తీసుకున్న ఈ భామ.. 'హరి కథలు' అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో ఎన్నో వీడియోలు చేస్తూ అలరించింది. మళ్లీ 'గని' మూవీతో కెరీర్ రీస్టార్ట్స్ చేసి.. ఇప్పుడు 'భోళా శంకర్' సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
ఒకవైపు సినిమాలు, మరోవైపు షోలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న హరితేజ.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మొత్తానికి ఇంటర్నెట్‌లో సందడి చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

బీచ్ ఫొటోలు షేర్ చేసిందిగా
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న హరితేజ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్న గౌను మాత్రమే ధరించి కనిపించింది. ప్రస్తుతం గోవా ట్రిప్‌లో ఉన్న ఈ భామ.. అక్కడి బీచ్‌లో హాట్ హాట్ ఫోజులతో రచ్చ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











