బిగ్ బాస్ హరితేజ అందాల ఆరబోత: ఓపెన్ టాప్‌లో ఊహించని విధంగా!

ఈ మధ్య కాలంలో టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలు చాలా మందే వెలుగులోకి వచ్చారు. అందులో కొందరు మాత్రం ప్రత్యేకతలను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి హరితేజ ఒకరు. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ టైమింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తున్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

అయితే, ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గడంతో పర్సనల్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హరితేజ సోషల్ మీడియా ఖాతాలో ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా కన్నేయండి మరి!

 Actress Hari Teja Shares Beautiful Photo in Instagram

సీరియళ్లతో ఫుల్ పాపులర్: హరితేజ కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టి 'మనసు మమత' సీరియల్‌లో నటించి హైలైట్ అయింది. ఆ తర్వాత 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్‌లో నటించింది. తద్వారా ఫుల్ పాపులర్ అయింది.

 Actress Hari Teja Shares Beautiful Photo in Instagram

యాంకర్‌గా యమ ఫేమస్: ఏకధాటిగా సీరియళ్లు చేస్తూ అలరిస్తోన్నప్పుడే హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం హోస్ట్ చేసింది. తద్వారా మంచి యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలను కూడా నడిపించింది.

 Actress Hari Teja Shares Beautiful Photo in Instagram

కెరీర్‌నే మార్చిన బిగ్ బాస్: బుల్లితెరపై సందడి చేస్తోన్న సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేకు చేరింది. అయితే, ఇందులో గెలవకున్నా అప్పటి నుంచి ఆమె కెరీర్ మారిపోయింది.

 Actress Hari Teja Shares Beautiful Photo in Instagram

ఎన్నో చిత్రాల్లో క్రేజీ రోల్స్: సుదీర్ఘ కాలం బుల్లితెరపై హవాను చూపించిన హరితేజ.. సినిమాల్లోకి కూడా ఎంటరైంది. 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'తో మొదలైన ఆమె ప్రయాణం.. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక, 'అఆ'లో ఆమె చేసిన పాత్ర హైలైట్ అయింది. ఇక, ఆమె కెరీర్‌లో 'దమ్ము', 'గబ్బర్ సింగ్', 'యూటర్న్', 'హిట్', 'ఎఫ్2', 'జాంబీ రెడ్డి' వంటి చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి.

 Actress Hari Teja Shares Beautiful Photo in Instagram

రీఎంట్రీ.. స్పీడు తగ్గింది: చాలా కాలం క్రితేమ హరితేజ.. దీపక్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఈ జంటకు కొన్నేళ్ల క్రితమే ఓ పాప జన్మించింది. ఆ సమయంలో కెరీర్‌కు బ్రేక్ తీసుకున్న ఈ భామ.. 'హరి కథలు' అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో వీడియోలు చేసింది. మళ్లీ 'గని' మూవీతో కెరీర్ రీస్టార్ట్స్ చేసింది. అయితే, గతంలో మాదిరిగా ఇప్పుడు స్పీడుగా సినిమాలు చేయట్లేదు.

అందులో యమా బిజీగా: చాలా కాలంగా వరుస పెట్టి సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న హరితేజ.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఇలా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

 Actress Hari Teja Shares Beautiful Photo in Instagram

హరితేజ అందాల విందు: సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తోన్న హరితేజ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె డీప్ నెక్ టాప్‌లో పై నుంచి సెల్ఫీ తీసుకుని కనిపించింది. దీంతో ఆమె అందాలు తెగ హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది ఓ రేంజ్‌లో వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X