యాంకర్ హరితేజ అందాల ప్రదర్శన: ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!
తెలుగు బుల్లితెరపై, వెండితెరపై కొందరు లోకల్ భామలు యమ సందడి చేస్తున్నారు. అందులో కొందరు మాత్రం ఓ రేంజ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. వారిలో ఆల్‌రౌండర్ హరితేజ ఒకరు. ఆరంభంలో టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఈ అమ్మడు.. కొంత కాలంగా సినిమాల్లో తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హరితేజ యమ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని బోల్డు ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!
ఆ సీరియళ్లు.. ఫుల్ ఫేమస్:కూచిపూడి డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించిన హరితేజ.. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'మనసు మమత' సీరియల్‌లో నటించి హైలైట్ అయింది. ఆ తర్వాత 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్‌లో నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది.

యాంకర్‌గానూ దూకుడుగా:వరుసగా సీరియళ్లు చేస్తోన్న సమయంలోనే హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా మారిపోయింది. ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం నడిపించింది. తద్వారా మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలను కూడా చేసి సత్తా చాటింది.
బిగ్ బాస్ టర్న్ చేసింది:బుల్లితెరపై నటిగా, యాంకర్‌గా అలరిస్తోన్న సమయంలోనే హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే ఛాన్స్ లభించింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేలో అడుగు పెట్టింది. అయితే, ఇందులో గెలవకున్నా అప్పటి నుంచి ఆమె కెరీర్ టర్న్ అయింది.

వరుస మూవీలు.. వాటిలో:టెలివిజన్ రంగంలో చాలా కాలం పాటు సందడి చేసిన హరితేజ.. 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాతో బిగ్ స్క్రీన్‌పైకి కూడా వచ్చింది. అలా ఎన్నో సినిమాల్లో సందడి చేసింది. 'అఆ'లో ఆమె చేసిన పాత్ర హైలైట్ అయింది. ఇక, ఆమె కెరీర్‌లో 'దమ్ము', 'గబ్బర్ సింగ్', 'యూటర్న్', 'హిట్', 'ఎఫ్2', 'జాంబీ రెడ్డి' వంటి చిత్రాలు హైలైట్ అయ్యాయి.
అన్నీ వాడుకుంటోందిగా:కెరీర్ మొదలైన కొంత కాలానికి హరితేజ.. దీపక్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ జంటకు కొన్నేళ్ల క్రితమే ఓ పాప పుట్టింది. ఆ సమయంలో కెరీర్‌కు బ్రేక్ తీసుకున్న ఈ భామ.. 'హరి కథలు' అనే యూట్యూబ్ ఛానెల్‌తో ప్రేక్షకులను అలరించింది. మళ్లీ 'గని' మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి యాంకర్‌గా, నటిగా అన్నీ ఆఫర్లూ వాడుకుంటోంది.

సోషల్ మీడియాలో బిజీ:సుదీర్ఘ కాలంగా సీరియల్ నటిగా, యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తోన్న హరితేజ.. వరుస ఆఫర్లతో బిజీగా ఉంటోంది. అయినా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఇలా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

హరితేజ గ్లామర్ ట్రీట్‌తో:హరితేజ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ టాప్‌లో ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. దీంతో ఆమె అందాలు తెగ హైలైట్ అవుతోన్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











