స్విమ్‌సూట్‌లో హరితేజ హాట్ షో: తడిచిన అందాలతో మరీ ఓవర్‌గా!
సాధరణంగా బుల్లితెరపై సందడి చేసే భామలు.. అదే రంగానికి పరిమితమై ఉండేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లే సినిమాల్లోనూ తెగ హడావిడి చేస్తోన్నారు. అలాంటి వాళ్లు చాలా మందే ఉన్నా.. కొందరు మాత్రమే స్పెషల్ అనిపించుకుంటోన్నారు. అందులో హరితేజ ఒకరు. చాలా కాలం క్రితమే టీవీలో షోలు, సీరియళ్లు చేసి అలరించిన ఈ భామ.. సినిమాల్లోకి ఎంటరైన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ హరితేజ భారీ ఫాలోయింగ్‌తో హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసం!
సీరియల్ నటిగా పాపులారిటీ:కూచిపూడి డ్యాన్సర్‌గా హరితేజ కెరీర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి నటిగా అడుగు పెట్టి 'మనసు మమత' సీరియల్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్ చేసింది. తద్వారా ఫుల్ పాపులర్ అయింది.

యాంకర్‌గా సత్తా చాటిందిగా:వరుస సీరియళ్లతో సందడి చేస్తోన్న సమయంలోనే హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం హోస్ట్ చేసింది. తద్వారా బెస్ట్ యాంకర్‌గా పేరు తెచ్చుకుని సత్తా చాటింది. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలను చేసింది.

బిగ్ బాస్ షోతో కెరీర్ స్పీడు:నటిగా, యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుని ఫినాలేకు చేరింది. అయితే, ఇందులో గెలవకున్నా అప్పటి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి.
వరుస చిత్రాలు.. ఫుల్ బిజీ:బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా హవాను చూపించిన హరితేజ.. సినిమాల్లోకి కూడా ఎంటరైంది. 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే'తో మొదలైన ఆమె జర్నీ.. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక, 'అఆ'లో ఆమె చేసిన పాత్ర హైలైట్ అయింది. ఇక, ఆమె కెరీర్‌లో 'దమ్ము', 'గబ్బర్ సింగ్', 'యూటర్న్', 'హిట్', 'ఎఫ్2', 'జాంబీ రెడ్డి' వంటి చిత్రాలు పేరు తెచ్చాయి.

తల్లైన తర్వాత రీఎంట్రీతో:దీపక్ అనే వ్యక్తిని హరితేజ ప్రేమ వివాహం చేసుకుంది. ఈ జంటకు కొన్నేళ్ల క్రితమే ఓ పాప జన్మించింది. ఆ సమయంలో కెరీర్‌కు బ్రేక్ తీసుకున్న ఈ భామ.. 'హరి కథలు' అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో ఎన్నో వీడియోలు చేసింది. మళ్లీ 'గని' మూవీతో కెరీర్ రీస్టార్ట్స్ చేసి.. ఇప్పుడు 'భోళా శంకర్' సహా పలు చిత్రాల్లో కీలకమైన పాత్రలను పోషిస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ:ఏకధాటిగా సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న హరితేజ.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మొత్తానికి ఇంటర్నెట్‌లో సందడి చేస్తూ దూసుకుపోతోంది.

పూల్‌లో హరితేజ హల్చల్:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా రచ్చ చేస్తోన్న హరితేజ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్విమ్‌సూట్ ధరించి కనిపించింది. దీంతో తడిచిన దేహంతో పాటు ఆమె తొడ అందాలు బాగా హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.


Click it and Unblock the Notifications











