ఆఫర్ల కోసం కమిట్‌మెంట్ ఇచ్చినా అదే ట్రీట్‌మెంట్.. సంచలన విషయాలను బయటపెట్టిన హిమజ!
తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అనేది తరచుగా వినిపించే నింద. తాజాగా ఈ విషయంపై స్పందించారు నటి హిమజ. కమిట్మెంట్ లో ఇచ్చినా ఇవ్వకపోయినా అలాంటి పరిస్థితి అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ హిమజ ఇండస్ట్రీలోని పరిస్థితులు, తెలుగు అమ్మాయిల గురించి ఏం చెప్పింది అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
ముందుగా సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు దక్కించుకున్న హిమజ ఆ తర్వాత సినిమాల్లో పలు సపోర్టింగ్ రోల్స్ లో నటించి ఆకట్టుకుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా కూడా మెరిసింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అనే అంశం గురించి మాట్లాడింది.

తెలుగు అమ్మాయిలు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, అందుకే వాళ్లకు టాలీవుడ్ లో అవకాశాలు రావని, ఇండస్ట్రీకి రావాలంటే భయపడాలి అని అంటారు. అందులో ఎంత వరకు నిజం ఉంది అనే ప్రశ్న ఎదురైంది హిమజకు. ఆమె స్పందిస్తూ రిజర్వ్డ్ గా ఉండట్లేదని ఇప్పటికే ప్రూవ్ అయింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కమిట్‌మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఛాన్సులు రావట్లేదు, అలాగని ఛాన్స్ లు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్లు ఇచ్చిన వాళ్లు కాదని విషయం స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పుకొచ్చింది.
ఇక ముంబై, బెంగళూరు నుంచి వచ్చిన ఎవరెవరికో ఛాన్సులు ఇస్తున్నారు. మనకు ఇవ్వట్లేదు అంటే అందరూ అన్ని క్యారెక్టర్లకు సరిపోరు. కానీ కొంతమందికి అవకాశాలు రాకపోవడానికి కారణం అత్యాశ అని హిమజ చెప్పుకొచ్చారు. నిజానికి చాలామందికి అవకాశాలు వస్తాయి. కానీ అత్యాశ వల్ల వాటిని కోల్పోతారని ఈ సందర్భంగా హిమజ వెల్లడించింది.
అన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా అంటే అందరూ సెట్ అవ్వరు అంటూ తన పరిస్థితినే ఉదాహరణగా చెప్పుకొచ్చిది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ ను హీరోయిన్ గా రెండేళ్లు సక్సెస్ ఫుల్ గా నడిపించి అవార్డులు కూడా అందుకున్నప్పటికీ తనకు మొదటి మూవీలో పని మనిషి క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందని, అయితే తనకు క్యారెక్టర్ ఏదైనా తన ట్యాలెంట్ ను నిరూపించుకోవడానికి మంచి అవకాశమని భావించానని వివరణ ఇచ్చింది హిమజ.

ఇండస్ట్రీలో హిమజ అనే ఒక తెలుగు అమ్మాయి ఉంది అనే గుర్తింపు ముఖ్యం కాబట్టి అప్పట్లో ఆ ఆఫర్ ఒప్పుకున్నారని, దానివల్లే ఆ తర్వాత తర్వాత తనకు శతమానం భవతి లాంటి మంచి మంచి సినిమాల్లో అవకాశాలు దక్కాయని హిమజ గుర్తు చేసుకుంది.
2015లో హిమజ శివ అనే మూవీలో కీలకపాత్రను పోషించింది. ఆ తర్వాత నేను శైలజ, జనతా గ్యారేజ్, ధృవ, మహానుభావుడు శతమానం భవతి, స్పైడర్, ఉన్నది ఒకటే జిందగీ, వినయ విధేయ రామ, చిత్రలహరి వంటి సినిమాల్లో కీలకపాత్రలను పోషించింది. ఆ తరువాత బిగ్ బాస్ 3లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అనంతరం జ అనే సినిమాలో హీరోయిన్ గా నటించగా, ఆ మూవీ బోల్తా కొట్టింది.


Click it and Unblock the Notifications











