ఆ కంటెస్టెంట్‌దే విజయం అంటున్న బిగ్ బాస్ ఫేం హిమజ.. కానీ వాళ్లు గెలవాలనుందట

దాదాపు 15 వారాల పాటు మజాను పంచిన బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించనున్నారు. దీంతో ఈ సారి ఎవరు గెలవబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. బయట టాక్ ప్రకారం అభిజీత్‌ విజయం సాధిస్తాడని ప్రచారం జరుగుతుండగా.. బిగ్ బాస్‌ షోలో ఏదైనా జరిగే అవకాశం ఉండడంతో ఫలితం వచ్చే వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో సీజన్‌ను ఎవరు గెలుస్తారన్న దానిపై ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేం హిమజ కామెంట్స్ చేసింది.

హైదరాబాద్‌లో ఓ షోరూం ఓపెనింగ్‌లో పాల్గొన్న హిమజ.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ గురించి స్పందిస్తూ.. 'ఈ సీజన్‌లో నాకు దేత్తడి హారిక కానీ, ఆరియానా గ్లోరీ కానీ గెలవాలని ఉంది. అయితే, ప్రస్తుత ట్రెండ్ ప్రకారం అభిజీత్ గెలుస్తాడని అనిపిస్తుంది. ఎక్కువ శాతం అతడికే విజయావకాశాలు ఉన్నాయి' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. వాస్తవానికి హిమజ హారిక, ఆరియానాకు మద్దతుగా గతంలో సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. వాళ్లకు ఓట్లు వేయమని ప్రేక్షకులను కూడా అభ్యర్థించింది.

Actress Himaja Comments on bigg boss telugu season 4 winner

నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హిమజ. 'స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఆమె.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లను దక్కించుకుని సత్తా చాటిందీ బ్యూటీ. తన కెరీర్‌లో 'శివమ్', 'నేను శైలజ', 'ధృవ', 'శతమానంభవతి', 'స్పైడర్', 'ఉన్నది ఒకటే జిందగీ', 'వినయ విధేయ రామ', 'చిత్రలహరి' సహా ఎన్నో చిత్రాల్లో నటించడంతో పాటు ఇప్పుడు 'ఆచార్య'లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన హిమజ.. మధ్యలోనే షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X