బిగ్ బాస్ లో కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనా? బయటపెట్టిన తెలుగు నటి హిమజ

Actress Himaja : సినిమాల మీద అభిమానం, సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలనే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెడదామని ఎంతోమంది అనుకుంటున్నారు. కానీ సరైన అవకాశాలు రాక తమ ప్రయత్నాలను విరమించుకుంటున్నారు కొందరూ. కానీ, మరికొందరు మాత్రం అలుపెరగకుండా తమ ప్రయత్నాలను చేస్తూ అవకాశాలను పొందుతున్నారు. అయితే ఇటీవల ఇండస్ట్రీలో మీటూ, కమిట్మెంట్ అనే పదాలు చాలా వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఆఫర్లు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఈ విషయంపై బుల్లితెర నటి, బిగ్ బాస్ బ్యూటీ హిమజ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ హిమజ ఏం కామెంట్ చేసిందంటే?

నటి హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలపై మక్కువతో హైదరాబాద్ లో అడుగుపెట్టింది ఈ అమ్మడు. తొలుత బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి సీరియల్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇలా 'స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో ఆఫర్లు అందుకుంది. తన సుదీర్ఘ కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించింది. అందులో శివమ్, నేను శైలజ, ధ్రువ, శతమానం భవతి, స్పైడర్ ,ఉన్నది ఒకటే జిందగీ, వినయ విధేయ రామ, వరుడు కావలెను వంటి సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Actress Himaja Controversial comments on biggboss and filmy industry commitments

వరుస సినిమా అవకాశాలతో పాటు షోలలో కూడా పాల్గొని సందడి చేస్తుంది. గతంలో బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వెళ్లి తనదైన శైలిలో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ అమ్మడు మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'జ' అనే సినిమాలో హీరోయిన్ గా నటించగా.. ఇందులో ప్రతాప్ రాజ్ అనే వ్యక్తి హీరోగా నటించగా సైది రెడ్డి చిట్టి దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమా డైరెక్టర్ గా ఓటీటీలో విడుదలైంది. ఆ తర్వాత 'కనబడుట లేదు' అనే సినిమాలో ఓ విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించింది ఇలా వరుసగా ప్రయోగాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది.

చాలా ఏళ్లుగా సినీ రంగంలో ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిమజ తన నట జీవితంలో తన కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావించింది. సినిమాలలోకి అడుగుపెట్టేముందు.. తాను చాలాసార్లు ఇబ్బందులు పడ్డానని, చాలా ఎత్తులను చూసానని ఒకానొక సమయంలో ఇదంతా వదిలి వెళ్ళిపోవాలనిపించింది అని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో బిగ్ బాస్ లో కూడా కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయా? అని ప్రశ్నించగా.. 'ఈ మధ్యకాలంలో కమిట్మెంట్స్ అంటేనే అర్ధాలు మారిపోతున్నాయని ఇంతకీ కమిట్మెంట్ అంటే ఏంటో కూడా తనకు అర్థం కావడం లేదని అన్నారు.

Actress Himaja Controversial comments on biggboss and filmy industry commitments

'బిగ్ బాస్ లో అలాంటివి చేయరు. వారికి ఆ ఆలోచన కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాస్ లో సెలెక్ట్ అయి ముందుకొస్తున్నారంటేనే.. వాళ్లందరూ స్ఫూర్తిగా ఉండే వాళ్ళు ఏది ఉన్న ముఖం మీద మాట్లాడేవారు. రఫ్ అండ్ టఫ్ క్యాండిడేట్స్ మాత్రమే బిగ్ బాస్ లో అడుగు పెడతారు. అలాంటి వాళ్లతో ఇలాంటి కమిట్మెంట్స్ విషయాల గురించి మాట్లాడే ప్రసక్తే లేదు అని తేల్చి పారేసింది. బిగ్ బాస్ లో తాను మూడుసార్లు ఇంటర్వ్యూను ఎదురుకోవాల్సి వచ్చిందని, ఈ మూడుసార్లు కూడా తాను ఎక్కడ అలాంటి ఫీలింగ్ ను ఎదుర్కోలేదని, తన ఫ్రెండ్స్ కూడా బిగ్ బాస్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారని, వారి కూడా ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని ఓపెన్ గానే చెప్పేసింది.

'అలాంటి ఆరోపణలు చేస్తున్నవారు.. వారికి అవకాశం రాకపోవడంతోనో.. నెగిటివ్గా ఏదైనా జరిగి ఉండవచ్చు అలాంటి సందర్భంలో ఎలాంటి కామెంట్స్ చేసి ఉండి ఉంటారని చెప్పుకొచ్చారు. తాను గాని, తన ఫ్రెండ్స్ గాని 0.001 పర్సెంట్ కూడా అలాంటి వేధింపులకు గురి కాలేదని హిమజ పేర్కొంది. ఆఫర్స్ వస్తేనేమో.. అది ఎవడికో కమిట్మెంట్ ఇచ్చి ఉంటుందని, లేకపోతే దాని దరిద్రం అంటూ కామెంట్స్ చేస్తారని బాధపడింది. కమిట్మెంట్ ఇస్తే ఆఫర్లు వస్తున్నాయి.. కమిట్మెంట్ ఇవ్వకపోతే ఆఫర్లు రావడం లేదా అంటూ నిలదీసింది. అలాంటి కామెంట్స్ కరెక్ట్ కాదని, టాలెంట్ ఉన్నవారికి ఎక్కడైనా అవకాశాలు దొరుకుతాయని, కానీ అందుకోసం ఓపికతో ఎదురుచూడాలని చెప్పకవచ్చింది నటి హిమజ.

More from Filmibeat

Read more about: himaja tollywood bigg boss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X