twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!

    |

    తెలుగులో ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని.. విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. ఎన్నో విమర్శలు.. ఆరోపణలు.. వివాదాలు చెలరేగుతోన్నా నిర్వహకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దీన్ని ప్రసారం చేసి సక్సెస్ అయ్యారు. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా ఎదిగిపోయారు. మంచి గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో తెలుగు నటి హిమజ ఒకరు. మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె.. బిగ్ బాస్‌పై తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

    కియారా గ్లామర్ మోత.. వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

    స్వయంవరంతో ఎంట్రీ.. అలా ఫేమస్ అయింది

    స్వయంవరంతో ఎంట్రీ.. అలా ఫేమస్ అయింది

    నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హిమజ. కెరీర్ ఆరంభంలో సీరియళ్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. 'స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఆమె.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లను దక్కించుకుని సత్తా చాటిందీ బ్యూటీ.

    అప్పుడలా చేసింది... ఇప్పుడు చిరంజీవితోనే

    అప్పుడలా చేసింది... ఇప్పుడు చిరంజీవితోనే

    తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దొరకడం కష్టం అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయినా సరే తనలోని అద్భుతమైన టాలెంట్‌తో ఎన్నో అవకాశాలను అందుకుంది నటి హిమజ. తన కెరీర్‌లో 'శివమ్', 'నేను శైలజ', 'ధృవ', 'శతమానంభవతి', 'స్పైడర్', 'ఉన్నది ఒకటే జిందగీ', 'వినయ విధేయ రామ', 'చిత్రలహరి' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇప్పుడు 'ఆచార్య'లోనూ చేస్తోంది.

    బిగ్ బాస్‌ షోలోకి అడుగు.. అలా ఎలిమినేషన్

    బిగ్ బాస్‌ షోలోకి అడుగు.. అలా ఎలిమినేషన్

    కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హిమజ. మూడో సీజన్‌కు కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె... తనదైన మార్కు చూపించి పాపులారిటీని సొంతం చేసుకుంది. నిజాయితీగా ఆడుతూ.. ఉన్నది ఉన్నట్లు చెబుతూ ప్రేక్షకుల నుంచి ఓట్లను రాబట్టింది. కానీ, కొన్ని గొడవల కారణంగా ఎన్నో రోజులు హౌస్‌లో ఉండలేకపోయింది.

    అందులో యమ యాక్టివ్.. టూర్లలో ఎంజాయ్

    అందులో యమ యాక్టివ్.. టూర్లలో ఎంజాయ్

    హిమజ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరోవైపు, తన స్నేహితులతో కలిసి తరచూ ఏదో ఒక ట్రిప్ వేస్తోందీ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే ఇటీవల తోటి నటీమణులతో కలిసి ఉత్తరాదికి వెళ్లింది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    హిమ‘జ' కథ మొత్తం మారిపోయాలా చేసింది

    హిమ‘జ' కథ మొత్తం మారిపోయాలా చేసింది

    ప్రస్తుతం హిమజ హీరోయిన్‌గా 'జ' అనే సినిమాను చేస్తోంది. ప్రతాప్ రాజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను సైదిరెడ్డి చిట్టెపు తెరకెక్కిస్తున్నాడు. జై దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై గోవ‌ర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవగా, తాజాగా ఇందులోని పాట విడుదలైంది. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

    బిగ్ బాస్ షో రహస్యాలు లీక్ చేసిన హిమజ

    బిగ్ బాస్ షో రహస్యాలు లీక్ చేసిన హిమజ

    బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంతో మంది వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న తర్వాత మీకు అవకాశాలే రాలేదా? అని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. హిమజను ప్రశ్నించింది. దీనికి సమాధానం చెబుతూ బిగ్ బాస్ గురించి కొన్ని రహస్యాలను లీక్ చేసిందామె.

    Recommended Video

    Deepika Padukone Offers Prayers @ Shree Siddhivinayak Temple Ahead Of ‘Chhapaak’ Release
    హౌస్‌లోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందే

    హౌస్‌లోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందే

    దీనిపై హిమజ స్పందిస్తూ.. 'బిగ్ బాస్ తర్వాత చాలా షోల నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి. కానీ, మాటీవీ వాళ్లతో చేసుకున్న ఒప్పందం వల్ల అవన్నీ కోల్పోయాను. లేకుంటే కథ వేరే ఉండేది. బిగ్ బాస్‌లోకి వెళ్లాలంటే.. నిర్ణీత కాలం పాటు మరే వినోద కార్యక్రమంలోనూ చేయకూడదని వాళ్ల ఒప్పందంలో ఉంది. కంటెస్టెంట్లంతా దానికి ఒప్పుకోవాల్సిందే' అంటూ చెప్పుకొచ్చింది.

    English summary
    Himaja is an Indian film actor who works primarily in Telugu cinema. She is noted actress by acting in movies like Nenu Sailaja, Unnadi Okate Jindagi, Mahanubhavudu, Shatamanam Bhavathi, Next Nuvve, Vinaya Videya Rama, Dhruva and Chitra Lahari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X